సమీక్ష : “బంగార్రాజు” – అలరించే ఫ్యామిలీ డ్రామా

Bangarraju Review In Telugu

విడుదల తేదీ : జనవరి 14, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ

దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ

నిర్మాత: అక్కినేని నాగార్జున

సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫీ: యువరాజ్

ఎడిటర్ : విజయ్ వర్ధన్ కె

 

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన పండుగ లాంటి సినిమా “బంగార్రాజు”. గత సంక్రాంతి సీజన్లో సూపర్ హిట్ అయిన “సోగ్గాడే చిన్ని నాయన” కి సీక్వెల్ గా అక్కినేని నాగార్జున మరియు తనయుడు నాగ చైతన్య లు హీరోలుగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం ఈరోజు మంచి బజ్ నడుమ రిలీజ్ అయ్యింది. మరి ఏ చిత్రం ప్రేక్షకుల అంచనాలు ఎంతమేర అందుకుందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వచ్చినట్టు అయితే అప్పుడు సోగ్గాడే లో ఎక్కడైతే ముగుస్తుందో ఈ కథ అక్కడ నుంచి మొదలవుతుంది. బంగార్రాజు(నాగార్జున) స్వర్గానికి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తుంటాడు. మరి ఇదిలా ఉండగా కొన్నాళ్ళకి తన భార్య సత్యమ్మ(రమ్య కృష్ణ) కూడా చనిపోయి బంగార్రాజు దగ్గరకే వెళ్తుంది. అక్కడ తమకి ఒక మనవడు నాగ చైతన్య(చిన బంగార్రాజు) ఉన్నాడని చిన బంగార్రాజుకి కూడా తాత పోలికలే వచ్చి కొంటెగా లైఫ్ ని సాగిస్తున్నాడని జీవితంపై ఎలాంటి శ్రద్ధ పెట్టడం లేదు నువ్వెళ్ళి మార్చమని సత్యమ్మ బంగార్రాజుకి చెబుతుంది. మరి ఈసారి అక్కడ నుంచి వచ్చిన బంగార్రాజు తన మనవడి కోసం ఏం చేసాడు? చిన బంగార్రాజుకి కూడా ఏవైనా ప్రాణాంతక ముప్పు ఉందా? ఉంటే వాటిని బంగార్రాజు ఎలా సాల్వ్ చేస్తాడు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమా చూసాక చిత్ర బృందం మొదటి నుంచి చెబుతున్న మాట వారిలోని కాన్ఫిడెన్స్ ఎంత బలంగా ఉందో క్లియర్ గా అర్ధం అవుతుంది. వారు నెలకొల్పిన అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాలో అనేక అంశాలు మేజర్ హైలైట్స్ గా నిలిచాయని చెప్పాలి. మొదటగా నటీనటుల పెర్ఫామెన్స్ కోసం చెప్పుకున్నట్టయితే…

నాగ చైతన్య రోల్ కోసం మొదటగా చెప్పాలి. ఇది వరకు వరకు చైతూ ని ఇలాంటి ఒక కొంటె పాత్రలో చూసి ఉండం దానిని చైతు సూపర్బ్ గా చేసాడని చెప్పాలి. తమ ఫామిలీ కి ఉన్న ఒక రొమాంటిక్ మార్క్ ని బంగార్రాజు తో చైతు తీసుకున్నాడని చెప్పడం లో డౌట్ లేదు. పలు కామెడీ సీన్స్ మంచి రొమాంటిక్ సీన్స్ సహా ఎమోషనల్ సన్నివేశాల్లో చైతు సాలిడ్ పెర్ఫామెన్స్ ఇచ్చి సినిమాలో హైలైట్ గా నిలిచాడు. అలాగే తన లుక్స్ కానీ సరికొత్త బాడీ లాంగ్వేజ్ కానీ తన నుంచి ప్రతిదీ ఆడియెన్స్ ని మంచి ఫీస్ట్ ఇచ్చేలా అనిపిస్తాయి.

ఇక కింగ్ నాగ్ విషయానికి వస్తే ఈసారి తన స్కోప్ అంతా చైతూకి ఇచ్చి వెనకుండి నడిపించే పాత్రలా మంచి నటన కనబరిచారు. బంగార్రాజు గా మళ్ళీ అదే మ్యాజిక్ తో మరింత ఉత్సాహాన్ని ఈ సినిమాలో అందించారని చెప్పాలి. ముఖ్యంగా చైతూ తో కలిపి ఉండే సన్నివేశాలు అయితే ఆడియెన్స్ కి మంచి ట్రీట్ లా కన్నుల పండువగా అనిపిస్తాయి. అంతే కాకుండా నాగ్ ఛార్మింగ్ లుక్స్ తన పాత్ర నుంచి మరో బిగ్ ఎసెట్.

అలాగే యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ఈ సినిమాలో మరో సరికొత్త పాత్రలో కనిపించి అలరిస్తుంది. ఉప్పెన తర్వాత మరోసారి పల్లెటూరి అమ్మాయిలా ఈసారి మరింత ఎనర్జిటిక్ రోల్ లో మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకుంది. అలానే చైతూకి తనకి కూడా స్క్రీన్ పై కనిపించే కెమిస్ట్రీ బావుంది. అలానే ఈ సినిమాలో మరింత అందంగా ఫన్నీ యాంగిల్ లో కూడా కనిపించి మెప్పిస్తుంది.

ఇంకా స్పెషల్ సాంగ్ లో కనిపించిన ఫరియా సినిమాలో హ్యాపీ మూడ్ కి మరింత జోష్ ని తీసుకొచ్చేలా చేసింది. అలానే వెన్నెల కిషోర్, రావు రమేష్ మరియు రమ్య కృష్ణ లు తమ రోల్ పరిధి మేరకు మంచి నటనను న్యాయంగా ఇచ్చేసారు.

వీటితో పాటుగా సినిమాలో మరింత ఆకట్టునే అంశాలు మరిన్ని ఉన్నాయని చెప్పాలి. ఎంటర్టైనింగ్ గా సాగే కథనం ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఈ పండుగ టైం లో ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. అలాగే మంచి ఇంటర్వెల్ క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి. అలానే సినిమాలో కనిపించే పల్లెటూరి నేపథ్యం కలర్ ఫుల్ గా కనిపించే విజువల్స్ మరియు పలు కీలక సన్నివేశాల ఎమోషన్స్ ఆడియెన్స్ ని ఆకట్టుంటాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సినిమా మొత్తం చూసాక ఫస్ట్ హాఫ్ అంత ఆసక్తిగా ఉన్నట్టు అనిపించదు. సినిమా స్టార్ట్ అయినపుడు ఆసక్తిగానే అనిపిస్తుంది కానీ తర్వాత తర్వాత సో సో గానే అనిపిస్తుంది. ఇంకా ఈసారి కథ అంత కొత్తగా ఉన్నట్టు అనిపించదు పైగా ఎమోషనల్ కంటెంట్ కూడా కాస్త తక్కువే ఉన్నట్టు అనిపిస్తుంది.

అలాగే సినిమాలో మరింత ఎంటర్టైన్మెంట్ కి స్కోప్ ఉంది కానీ దానిని అనవసరంగా కొన్ని పాటలు పెట్టి పక్కదారి పట్టించినట్టు అనిపిస్తుంది. సినిమా నిడివి ఒకింత ఎక్కువయ్యినట్టు కూడా అనిపించక మానదు.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు సాలిడ్ గా ఉన్నాయని చెప్పాలి. సినిమా బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టుగా మేకర్స్ పెట్టిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అలాగే టెక్నికల్ టీం లో సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పాలి. లాస్ట్ టైం సోగ్గాడే సినిమాకి తన మ్యూజిక్ తో అలా అయితే సోల్ గా నిలిచాడో ఈసారి కూడా అంతకు మించే ఇచ్చాడని చెప్పాలి. తాను ఇచ్చిన అన్ని పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెర్షన్ లు చాలా నీట్ గా కంపోజ్ చేసి హైలైట్ అయ్యాడు. అలాగే యువరాజ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా మంచి కలర్ ఫుల్ గా ఉంది. అలానే డైలాగ్స్, సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా నీట్ గా ఉన్నాయి.

ఇక దర్శకుడు కళ్యాణ్ కృష్ణ విషయానికి వస్తే ఈసారి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు చెప్పాలి. ముఖ్యంగా సీక్వెల్ ని తాను ప్లాన్ చేసిన విధానం మెప్పించే విధంగా ఉంది. అలానే దానిని తెరకెక్కించిన విధానం కూడా ఆకట్టుకునే రీతిలో ఉండడం ఈ సినిమా విజయంలో ముఖ్య భాగం. అయితే సినిమాలో ఫస్ట్ హాఫ్ ని ఇంకా బాగా మలచి ఉంటే బాగుండేది. మరికొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ ని జోడించినట్టు అయితే సినిమా అవుట్ మరింత మెరుగ్గా వచ్చి ఉండేది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ “బంగార్రాజు” ఈ పండుగకి ఆకట్టుకుంటాడని చెప్పాలి. నాగార్జున, నాగ చైతన్యల స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్ మరియు ఇతర నటీనటుల పెర్ఫామెన్స్ లు అంతా బాగా ఆకట్టుకుంటాయి. అంతగా రుచించని ఫస్ట్ హాఫ్ పక్కన పెడితే మిగతా అంశాలు అన్నీ సినిమాలో మంచి హైలైట్ గా నిలిచి పండుగ వాతావరణంకి కరెక్ట్ గా సెట్ అవుతాయి. ఓవరాల్ గా అయితే కళ్యాణ్ కృష్ణ ఈ డీసెంట్ సీక్వెల్ ఆడియెన్స్ ని మెప్పిస్తుంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version