“బిగ్ బాస్” ఓటిటి హోస్ట్ గా సీజన్ 5 ఈ కంటెస్టెంట్ పేరు.?


మన తెలుగు బుల్లితెర అతి పెద్ద రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది స్టార్ మా ఛానెల్లో ప్రసారం అయ్యే “బిగ్ బాస్” అని అందరికీ తెలిసిందే. ఒక్క మన తెలుగు లోనే కాకుండా మొత్తం మన దేశంలోనే అతి పెద్ద రియాలిటీ షో ఇది. మరి ఇదిలా ఉండగా ఈ షో అన్ని భాషల్లో ప్రసారం అవుతున్నా మన తెలుగు లోనే అతి పెద్ద హిట్ గా నిలవడం విశేషం.

మరి అందుకే మేకర్స్ మరో ముందు అడుగు వేసి తెలుగులో వస్తున్న ఆదరణ నిమిత్తం ఏకంగా 24 గంటల లైవ్ ఓటిటి బిగ్ బాస్ షో ని ప్లాన్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. అయితే అక్కడ నుంచి దీనికి గాను హోస్ట్ గా ఎవరు చేస్తారు అనే అంశం బాగా హాట్ టాపిక్ గా మారుతూ రాగా ఇప్పుడు ఒక పేరు అయితే మంచి బజ్ తో వినిపిస్తుంది.

ఈసారి బిగ్ బాస్ ఓటిటి కి గాను గత సీజన్ 5 లో కనిపించిన ఒక స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్ అయినటువంటి ఆర్జే కాజల్ పేరు వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత మేర నిజముందో వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే షో ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి వేచి చూడాలి ఈసారి హోస్ట్ గా ఎవరు చేస్తారో అనేది.

Exit mobile version