ఓటీటీ సమీక్ష : “భామా కలాపం” – తెలుగు చిత్రం ‘ఆహా’ లో ప్రసారం

Bhama Kalapam Review In Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 11, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: ప్రియమణి, శాంతి రావు, జాన్ విజయ్, శరణ్య ప్రదీప్, పమ్మి సాయి

దర్శకత్వం : అభిమన్యు

నిర్మాతలు: బాపినీడు, సుధీర్

సంగీత దర్శకుడు: జస్టిన్ ప్రభాకరన్, మార్క్ కె రాబిన్

సినిమాటోగ్రఫీ: దీపక్ యెరగరా

ఎడిటర్ : విప్లవ్ నైషాదం


మన మొట్టమొదటి తెలుగు స్ట్రీమింగ్ యాప్ అయినటువంటి “ఆహా” వారు ఇప్పుడు మరింత అద్భుతమైన కంటెంట్ ని తీసుకొస్తున్నారు. మరి లేటెస్ట్ గా అయితే హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “భామా కలాపం” ను డైరెక్ట్ స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

ఇక కథ లోకి వచ్చినట్టు అయితే అనుపమ(ప్రియమణి) యూట్యూబ్ లో ఒక ఫేమస్ యూ ట్యూబర్ కం గృహిణి. అంతే కాకుండా ఆమెకో వింత అలవాటు కూడా ఉంటుంది. ఎప్పుడూ అవతల వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది? అని తెలుసుకోవడంలో చాలా ఆసక్తి కనబరుస్తుంది. మరి ఇదే అలవాటుతో ఓ రోజు ఒకరి ఇంట్లోకి వెళ్లి ఊహించని విధంగా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటుంది. ఆ తర్వాత ఆమెకి మరిన్ని చిక్కులు ఎదురవుతాయి. అయితే అసలు ఆ మర్డర్ చేసింది ఎవరు? అయ్యింది ఎవరు? ఈ సమస్య నుంచి అనుపమ బయటపడుతుందా లేదా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని ఆహా లో వీక్షించాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో హైలైట్ పాయింట్స్ లో మొదటగా ఈ సినిమా బేసిక్ పాయింట్ కోసం అని చెప్పాలి. ఈ చిత్రంలో అది ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. అలాగే సినిమాలో కథ మొదలై అది ఒక్కో పాత్ర చుట్టూతా డెవలప్ అయ్యే విధానం కానీ ఈ సినిమాలో ఇంప్రెస్ చేస్తాయి. ఇక ప్రియమణి పెర్ఫామెన్స్ విషయానికి వస్తే చాలా కాలం తర్వాత తన నుంచి తన లోని బెస్ట్ ఇచ్చే రోల్ లా ఇది కనిపిస్తుంది అని చెప్పాలి.

ఇతరుల జీవితాలపై ఆసక్తి కలిగిన గృహిణిగా ఆమె చూపించిన ఎమోషన్స్ తర్వాత కథానుసారం జరిగే డెవలప్మెంట్స్ లో తన వేరియేషన్స్ ని తాను అద్భుతంగా పండించింది. అలాగే మరో కీలక పాత్రలో నటించిన శరణ్య ప్రదీప్ కూడా ఈ చిత్రంలో మంచి నటనను కనబర్చి సపోర్ట్ చేసింది.

ఇంకా ఈ చిత్రంలో చర్చ్ ఫాథర్ గా కనిపించిన నటుడు కిషోర్ కుమార్ కూడా మంచి నటనను కనబరిచారు. అలాగే సినిమాలో కనిపించే సస్పెన్స్ ఫుల్ థ్రిల్లింగ్ అంశం దాని చుట్టూ నడిచే కథనం గాని ఎండింగ్ హ్యాండిల్ చేసిన విధానం బాగుంటాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో ఇంప్రెస్ చేసే అంశాలు బాగానే అనిపిస్తాయి కానీ అదే సమయంలో కొన్ని అంశాలు అంతే స్థాయిలో నిరాశ పరిచేవిగా అనిపిస్తాయి. ఈ సినిమా కథనంలో పెద్దగా సీరియస్ నెస్ ఎక్కడా కనిపించదు. ప్రియమణి పాత్ర ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాక చూపించిన మార్పులు అయితే అంతే ఎఫెక్టివ్ గా ఏమీ ఉండవు.

అలాగే ప్రియమణి భర్త పాత్ర అయితే అర్ధ రహితంగా మిగిలిపోవడం ఒక ప్రశ్నార్ధకం. ఇంకా ఈ చిత్రంలో మరింత డ్రామా యాడ్ చెయ్యడానికి స్కోప్ ఉంది కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి అదంతా మిస్ అవుతుంది. అలాగే చాలా కొన్ని లాజిక్ లెస్ సిల్లీ సన్నివేశాలు కూడా ఈ చిత్రంలో కనిపిస్తాయి. విలన్ పాత్ర కూడా అంత ప్రభావవంతంగా ఉండదు పైగా చికాకు తెప్పిస్తుంది.

సాంకేతిక విభాగం :

ఈ చిత్రంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఈ సినిమా నిర్మాణ విలువలు కోసం అని చెప్పాలి. మేకర్స్ పెట్టిన ఖర్చు వృథా కాకుండా మంచి విజువల్స్ తో కనిపిస్తుంది. అలాగే సినిమాటోగ్రఫీ గాని మ్యూజిక్ గాని బాగున్నాయి. కాకపోతే కిన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బెటర్ గా ఇవ్వాల్సింది.

ఇక దర్శకుడు అభిమన్యు విషయానికి వస్తే ఈ సినిమాకి తన వర్క్ అయితే ఇంప్రెస్ చేస్తుందని చెప్పాలి. తాను ఎంచుకున్న కథ దానిని బాగానే హ్యాండిల్ర్ చేసాడు కానీ ఇంకా బెటర్ నరేషన్ ఇచ్చి ఉంటే మంచి డ్రామా తో ఇచ్చి ఉంటే డెఫినెట్ గా మరింత ఎంటర్టైన్మెంట్ ని ఈ చిత్రం అందించి ఉండేది.

తీర్పు :

ఇక ఫైనల్ గా చూసినట్టు అయితే ఈ “భామా కలాపం”, ప్రియమణి సాలిడ్ పెర్ఫామెన్స్ మరియు ఈ సినిమాలో కనిపించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కొన్ని ఆకట్టుకుంటాయి. కాకపోతే కొన్ని లాజిక్స్ మిస్సవ్వడం, సెకండాఫ్ లు అంతగా రుచించవు. మరి ఇవి పక్కన పెడితే మిస్టరీ, థ్రిల్లర్ మూవీ లవర్స్ ని భామా కలాపం ఆకట్టుకుంటుంది.

 

 

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

 

Click Here English Version

Exit mobile version