విడుదల తేదీ : ఫిబ్రవరి 12, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్ సిసిల్, బ్రహ్మాజీ
దర్శకత్వం : విమల్ కృష్ణ
నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ
సంగీత దర్శకుడు: శ్రీచరణ్ పాకల, థమన్ ఎస్(బ్యాక్గ్రౌండ్ స్కోర్)
సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
ఎడిటర్ : నవీన్ నూలి
ఈ ఏడాది ఆడియెన్స్ లో మంచి క్రేజ్ తో వచ్చిన మరో లేటెస్ట్ చిత్రం “డీజే టిల్లు”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరోయిన్స్ సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి లు నటించిన ఈ చిత్రం సాంగ్స్, ట్రైలర్ తో అయితే ఈ సినిమా ఇంకో లెవెల్ కి వెళ్ళిపోయింది. మరి అలా మంచి ప్రమోషన్స్ తో ఈ రోజు థియేటర్స్ లో డీజే వాయించేందుకు టిల్లు దిగాడు. మరి తన డీజే ఆకట్టుకునేలా ఉందా లేదా అనేది సమీక్షలో చూద్దాం రండి..
కథ :
ఇక కథలోకి వచ్చినట్టు అయితే డీజే టిల్లు(సిద్ధూ జొన్నలగడ్డ) ఒక ఫేమస్ డీజే గా తన లైఫ్ ని మస్త్ మజా చేస్తూ కొనసాగిస్తుంటాడు.. ఇలా సాగుతున్న తన లైఫ్ లోకి రాధికా(నేహా శెట్టి) ఎంటర్ అవుతుంది. ఆమె ఎంటర్ అవ్వడంతోనే ఇంప్రెస్ అయ్యిన టిల్లు ప్రేమలో పడతాడు.. కానీ ఆమె మూలాన తర్వాత ఒక షాకింగ్ ఇన్సిడెంట్ లో ఇరుక్కుంటాడు. మరి ఆమె పరిచయం తర్వాత టిల్లు లైఫ్ లో వచ్చిన మార్పులు ఏంటి? వాటి నుంచి తాను ఎలా బయటపడతాడు? వీటనట్టితో ఆడియెన్స్ కి ఎంత ఎంటర్టైన్మెంట్ దొరికింది అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఓ సినిమా హైలైట్ అవ్వాలి అంటే అందులో ఉండే అన్ని కీలక అంశాలతో పాటుగా హీరో పాత్ర కూడా ఒకటి. అది గాని పర్ఫెక్ట్ గా వస్తే సినిమా చూసే వాళ్ళకి మరింత ఆసక్తి కలుగుతుంది అలా ఒక హీరో క్యారక్టరైజేషన్ తో ఆకట్టుకునే కొన్ని సినిమాల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు. ఈ చిత్రంలో టిల్లు పాత్ర గాని తన టైమింగ్ గాని బాడీ లాంగ్వేజ్ అన్నీ మాంచి యూనిక్ గా అనిపిస్తాయి.
ఇక ఈ పాత్రలో చేసిన సిద్ధూ బాయ్ అయితే అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చాడని చెప్పాలి. ఇది వరకే తాను ఒక సెటిల్డ్ పెర్ఫామర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఈ డీజే టిల్లు అనే రోల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లా ఉంటుంది. కంప్లీట్ కొత్త మేకోవర్ లో ఆల్రెడీ టీజర్, ట్రైలర్స్ లో కనిపించాడు. మరి అలాగే సినిమాలో అయితే తన పాత్రతో కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తాడు. తన మాట, చేత అన్నీ హిలేరియస్ గా అనిపిస్తాయి. ఖచ్చితంగా సిద్ధూ మున్ముందు మంచి హీరోగా సెట్ అవుతాడు.
ఇక ఈ సినిమాలో మరో హైలైట్ హీరోయిన్ నేహా శర్మ అని చెప్పాలి. తన రోల్ లో తాను ఒక క్లీన్ పెర్ఫామెన్స్ ని ఆమె కనబర్చింది. అయితే తన రోల్ మొదట మరీ అంత వల్గర్ టైప్ లో ఉంటుందా అనే ప్రశ్నకి అయితే మంచి సమాధానమే చిత్రంలో దొరుకుతుంది. ఓ పక్క మంచి బ్యూటిఫుల్ లుక్స్ తో కనిపించడమే కాకుండా తన గ్లామర్ తో కూడా నేహా ఎక్కడా తగ్గకుండా ఆకట్టుకుంది. మరి ఇంకా సిద్ధూ తో కొన్ని సీన్స్ అయితే మంచి హైలైట్ గా పేలాయి. అలాగే నటుడు బ్రహ్మాజీ మరియు ప్రిన్స్ లు మంచి పాత్రల్లో కనిపించి మెప్పించారు. వీటితో పాటుగా ఎంటర్టైనింగ్ సాగే కథనం సినిమాలో ఆకట్టుకుంటుంది.
మైనస్ పాయింట్స్ :
ఎంటర్టైనింగ్ ఫస్ట్ హాఫ్ తర్వాత సినిమా కాస్త నెమ్మదించినట్టుగా అనిపిస్తుంది అలాగే తర్వాత తర్వాత కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ ఎవ్వడు. మరి అలాగే సెకండాఫ్ లోకి వచ్చాక మరిన్ని ఫ్లాస్ కనిపిస్తాయి.
కొన్ని సన్నివేశాలు ఏదో కావాలని ఇరికించినట్టుగా మరికొన్ని సన్నివేశాలు డల్ గా అనిపిస్తాయి. అయితే కాస్త డ్రాప్ అయిన సెకండాఫ్ ని మాత్రం క్లైమాక్స్ కి వచ్చే సరికి సెటిల్ చెయ్యడం కాస్త ఆకట్టుకునే అంశంగా మారుతుంది.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రంలో సితార ఎంటర్టైన్మెంట్స్ వారి ఖర్చు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది సినిమా క్వాలిటీ కోసం వారు పెట్టిన ఎఫర్ట్స్ నిజంగా సూపర్బ్ అని చెప్పాలి. ఇక అలాగే లాస్ట్ మినిట్ లో సినిమా కోసం థమన్ ని దింపి ఇంకో హైలైట్ గా సినిమాకి నిలిపారు. తన పాత్రకి థమన్ మాత్రం మంచి అవుట్ పుట్ ని అందించాడు. అలాగే శ్రీచరణ్ పాకల ఇచ్చిన ప్రతి సాంగ్ కూడా విజువల్ గా మంచి ట్రీట్ ఇచ్చింది.
ఇంకా ప్రకాష్ ఉమ్మడిసింగు ఇచ్చిన సినిమాటోగ్రఫీ బాగుంది తాను మంచి విజువల్స్ ని చూపించాడు. ఇక అలాగే ఈ సినిమాకి సిద్ధూ నే ఇచ్చిన డైలాగ్స్ మాత్రం ఇన్స్టంట్ హిట్ అయ్యాయి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఇచ్చాడు. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది.
ఇక ఈ చిత్ర దర్శకుడు విమల్ కృష్ణ విషయానికి వస్తే మొదటగా లాజిక్స్ నే పక్కన పెడితే తాను మంచి వర్క్ ఇచ్చాడని చెప్పాలి. తాను డిజైన్ చేసిన టిల్లు పాత్ర దానిని ఆవిష్కరించిన విధానం అన్ని బాగా హ్యాండిల్ చేశారు. అయితే తాను ఎంచుకున్న స్టోరీ లైన్ అంత గొప్పది కాకపోయినా దానిని ఎంటర్టైనింగ్ గా చూపించడంలో మాత్రం తాను సక్సెస్ అయ్యాడని చెప్పాలి. కాకపోతే కొన్ని లాజికల్ ఎర్రర్స్ ని సరిచేసుకోవాల్సి ఉంది.
తీర్పు :
ఇక ఫైనల్ గా చూసుకున్నట్టయితే ఈ “డీజే టిల్లు” లో హీరో పాత్ర, తన క్యారక్టరైజేషన్ మరియు హీరోయిన్ గ్లామ్ షో లు మ్యూజికల్ గా సాగే ఎంటర్టైనింగ్ కథనం వంటివి మంచి హైలైట్ అయ్యి డెఫినెట్ ఎంటర్టైనర్ గా నిలుపుతాయి. కాకపోతే చిన్న చిన్న లోపాలను పక్కన పెడితే ఈ డీజే టిల్లు వీకెండ్ లో మాంచి ఎంటర్టైన్మెంట్ ని అందరికీ అందిస్తాడు.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team