విడుదల తేదీ : ఫిబ్రవరి 19, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: యామీ గౌతమ్, కరణ్వీర్ శర్మ, అతుల్ కులకర్ణి, నేహా ధూపియా, డింపుల్ కపాడియా
దర్శకత్వం : బెహజాద్ ఖంబటా
నిర్మాతలు: రోనీ స్క్రూవాలా, ప్రేమనాథ్ రాజగోపాలన్
సంగీత దర్శకుడు: రూషిన్ దలాల్, కైజాద్ గెర్డా
ఎడిటర్ : సుమీత్ కోటియన్
ప్రముఖ గ్లామరస్ నటి యామి గౌతమ్ కొంత కాలం బ్రేక్ ఇచ్చి చేసిన లేటెస్ట్ చిత్రం “ఏ థర్స్ డే”. ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఎలా ఉందో అన్ని భాషలు వారు చూడడగేలా ఉంటుందా లేదా సమీక్షలో చూద్దాం రండి.
కథ :
నైనా జైస్వాల్(యామి గౌతమ్) ఓ ప్లే స్కూల్ లో టీచర్ గా పని చేస్తుంది. అయితే కొన్ని రోజులు లీవ్ తీసుకొని మళ్ళీ వస్తుంది.. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో ఈమె ఊహించని రీతిలో అక్కడి 16 మంది పిల్లలను కిడ్నాప్ చేసి కొన్ని డిమాండ్స్ కావాలని చెప్తుంది. మరి అసలు ఈ స్కూల్ టీచర్ ఎవరు? పిల్లలని ఎందుకు అపహరించింది? తాను కోరిన డిమాండ్స్ ఏమిటి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని హాట్ స్టార్ లో చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో మెయిన్ హైలైట్ నే యామీ అని చెప్పాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆమె తన పెర్ఫామెన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. చాలా వరకు తన రోల్ మంచి ఛాలెంజింగ్ గానే ఉంటుంది. దానిని ఆమె బాగా చేసి రక్తి కట్టించింది.
అలాగే సినిమాలో మొదటి గంటన్నర మంచి మంచి ఎంగేజింగ్ గా ఉంటుంది. అలాగే క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ కూడా సినిమాలో బావున్నాయి. అలాగే మరో కీలక పాత్రల్లో నటించిన నేహా దుపియా, దింపుల్ కపాడియా మరియు అతుల్ కులకర్ణి తదితరులు తమ పాత్రలలో బాగా నటించారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమా స్టార్టింగ్ బాగానే ఉన్నా మరికొన్ని సమయాల్లో కూడా బాగానే అనిపిస్తుంది. కానీ కొన్ని సమయాల్లో మాత్రం ఒకే సారి బాగా డల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే కొన్ని కీలక సన్నివేశాల్లో లాజిక్స్ అయితే మరీ ఓవర్ గా పరిమితి దాటేసినట్టు అనిపిస్తాయి.
అలాగే ఎమోషన్స్ కూడా అంత బలంగా అయితే ఎలివేట్ అయ్యినట్టు ఎక్కడా కనిపించదు. అలాగే సినిమాలో కనిపించే మీడియా యాంగిల్ ని కూడా ఇంకా డిటైల్డ్ గా చూపించి ఉంటే బాగుండేది.
సాంకేతిక వర్గం :
ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయని చెప్పాలి. అలాగే టెక్నికల్ టీం లో అయితే మ్యూజిక్ వర్క్ ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. పలు సన్నివేశాల్లో చాలా ఎగ్జైటింగ్ మ్యూజిక్ ఈ సినిమాలో వినిపిస్తుంది. అలాగే కెమెరా వర్క్ కూడా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు.
ఇక దర్శకుడు భజాద్ విషయానికి వస్తే తాను కాస్త రొటీన్ ప్లాట్ లైన్ నే ఎంచుకున్నా దానిని పర్వాలేదు అనిపించే స్థాయిలో ప్రెజెంట్ చేసాడు. కాకపోతే ఇంకా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఏమన్నా జోడించి ఉంటే బాగుండేది.
తీర్పు :
ఇక ఫైనల్ గా చూసినట్టు అయితే “ఏ థర్స్ డే” లో మెయిన్ లీడ్ యామీ గౌతమ్ తన పెర్ఫామెన్స్ ఫస్ట్ హైలైట్ గా నిలుస్తుంది. అలానే మరికొన్ని ఎలిమెంట్స్ మంచి థ్రిల్ ని కూడా అందిస్తాయి. కాకపోతే కొన్ని లాజిక్స్, స్లో కథనం వల్ల అక్కడక్కడా నెమ్మదించినట్టు అనిపిస్తుంది. జస్ట్ వీటిని పక్కన పెడితే థిల్లర్ మూవీ లవర్స్ ని మాత్రం ఇది ఆకట్టుకుంటుంది.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team