సమీక్ష : ఝుండ్ (అమితాబ్ బచ్చన్)

Jhund Review In Telugu

విడుదల తేదీ : మార్చి 4, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: అమితాబ్ బచ్చన్, ఆకాష్ థోసర్, రింకూ రాజ్‌ గురు

దర్శకత్వం : నాగ్ రాజు మంజులే

నిర్మాత: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, సందీప్ సింగ్, రాజ్ హిరేమత్, సవితా రాజ్, హిరేమత్, నాగరాజ్ మంజులే, గార్గీ కులకర్ణి, మీను అరోరా

సంగీత దర్శకుడు: సాకేత్ కనేత్కర్

సినిమాటోగ్రఫీ: సుధాకర్ రెడ్డి యక్కంటి

ఎడిటర్ : కుతుబ్ ఇనామ్దార్, వైభవ్ దభాడే

 

ఝుండ్ గత కొంత కాలంగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా ఉన్న చిత్రం. అమితాబ్ బచ్చన్ నటించిన ఈ చిత్రం ఈ రోజు థియేటర్ల లో విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.

 

కథ:

అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, ఫుట్‌బాల్ కోచ్ విజయ్ బార్సే నిజ జీవితం ఆధారంగా తెరకెక్కింది. స్లమ్ సాకర్ అనే NGO ని స్థాపించిన రిటైర్డ్ స్పోర్ట్స్ టీచర్. అట్టడుగు కులాల పిల్లలను డ్రగ్స్ మరియు నేరాలకు దూరంగా ఉంచడం ద్వారా అతను వారికి ఎలా పునరావాసం కల్పిస్తాడు అనేది కథలో ముఖ్య భాగం. విజయ్ ఈ పిల్లల కి ఆశ్రయం ఇచ్చి, ఫుట్ బాల్ గేమ్ లో ఆడే విధంగా తయారు చేస్తాడు. ఇదంతా తను ఎలా చేశాడు అనేది తెలియాలంటే వెండి తెర పై సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

ఫుట్‌బాల్ కోచ్‌గా అమితాబ్ బచ్చన్ చాలా బాగా నటించారు. టాలెంట్‌ ని కనిపెట్టి వారికి కోచింగ్‌ ఇచ్చిన తీరు, మరియు అమితాబ్ నటించిన విధానం ను వెండి తెర పై చక్కగా చూపించారు. ఈ చిత్రం లో తన జీవితం లోని ఎమోషన్స్‌ని పిల్లలకు చూపించి తమ పై నమ్మకం కలిగించిన విధానం అద్బుతం గా ఉంది.

సినిమాకు మిగతా నటీనటుల నటన అదనపు బలం అని చెప్పాలి. మురికివాడల్లో నివసించే వారీగా పిల్లలు మరియు మిగతావారు అద్బుతం గా నటించారు. వారి మేకప్ కూడా సినిమా లోని కథకి తగిన విధంగా ఉంది. వెండితెర పై వారి బాధ, సంతోషం లని ప్రదర్శించిన విధానం చాలా బాగుంది.

 

మైనస్ పాయింట్స్:

అమితాబ్ బచ్చన్ ఈ చిత్రం లో ఫుట్‌బాల్ కోచ్ గా నటించారు. అయితే సాకర్ ఆధారంగా తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో అతను సాకర్ ఆడే సన్నివేశాలు లేవు. ఇది కాస్త ప్రేక్షకులని నిరాశకు గురి చేస్తుంది అని చెప్పాలి. ఇప్పటికే ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలు చాలానే వచ్చాయి. అయితే ఇలాంటి చిత్రాల్లో సెకండాఫ్‌లో వచ్చే ఎమోషన్స్‌ ను మనం ముందుగానే ఊహించవచ్చు.

సినిమాలో ఎంతో ఇంటెన్స్ సబ్జెక్ట్ ఉంది. కానీ స్పోర్ట్స్ డ్రామా లకి కావాల్సిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో లేవు అని చెప్పాలి. డ్రామాను తగ్గించడానికి చాలా స్కోప్ ఉంది, కానీ ఇందులో అలా లేదు రొటీన్ స్క్రీన్ ప్లే తో అంతగా ఆకట్టుకోదు. ఆట గురించి ఎంతగానో హైప్ క్రియేట్ చేసినప్పటికీ, చూపించడం లో మాత్రం అంతగా ఆకట్టుకోదు.

 

సాంకేతిక విభాగం:

ఈ చిత్రం లో అన్ని స్లమ్ కి సంబంధించిన సెటప్ లు బాగా చూపించడం జరిగింది. అంతగా ఆసక్తి పెంచేలా చేసిన కెమెరా వర్క్ బాగుంది అని చెప్పాలి. బిగ్ బి కోసం రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ఎమోషనల్ గా ప్రేక్షకులను అలరిస్తాయి. ఎడిటింగ్‌ యావరేజ్‌గా ఉంది కానీ అజయ్‌ అతుల్‌ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు వెండి తెరపై చూస్తే ఇట్టే అర్ధం అవుతుంది. దర్శకుడు నాగరాజు మంజులే విషయానికి వస్తే, అతను మరాఠీలో సైరాట్‌ చిత్రం తో డిఫెరెంట్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అతను ఈ చిత్రం కోసం అద్భుతమైన కథాంశాన్ని ఎంచుకున్నాడు. కానీ రొటీన్ గా ప్రదర్శించడం మరియు కొత్తగా ఏమీ లేకపోవడం తో కాస్త బోరింగ్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది.

 

తీర్పు:

మొత్తం మీద, ఝుండ్ చిత్రం కథ పరం గా అందరినీ ఆకట్టుకుంటుంది. అమితాబ్ బచ్చన్ ఈ చిత్రం లో చాలా బాగా నటించి సినిమా సక్సెస్ లో కీలకం గా మారారు. ఈ చిత్రం లో ఫుట్ బాల్ గేమ్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు థ్రిల్ తో పాటుగా ఉత్కంఠ భరితంగా ఉంటే ఇంకా బాగుండేది. మీరు స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే వారైతే, ఈ చిత్రాన్ని ఈ వారాంతం చూడవచ్చు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version