బిగ్‌బాస్ నాన్‌స్టాఫ్: ఈ వారం ఎలిమినేట్ కాబోతుంది ఎవరంటే?


బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షో అప్పుడే మూడో వారాన్ని పూర్తి చేసుకుంది. మొత్తం 17 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షో లో మొదటి వారం వారియర్స్ నుంచి ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా, రెండో వారం ఛాలెంజర్స్ నుంచి శ్రీరాపాక ఎలిమినేట్‌ అయ్యారు. ఇక హౌస్‌లో మిగిలిన 15 మందిలో మూడో వారం మహేశ్ విట్టా, అజయ్‌ కాతువాయూర్‌, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, అరియానా గ్లోరీ, నటరాజ్‌ మాస్టర్‌, మిత్ర శర్మ, తేజస్వి మదివాడ, యాంకర్‌ శివ, బిందుమాధవి, హమీదా, అఖిల్ సార్థ‌క్‌లు నామినేషన్స్‌లోకి వచ్చారు.

అయితే నామినేషన్స్‌లో ఉన్న ఈ 12 మందిలో ఈ సారి కూడా ఛాలెంజర్స్‌లో నుంచే ఒకరు ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ వారం ఆర్జే చైతూ ఎలిమినేట్‌ అయ్యాడట. ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌లో సత్తా చూపి కెప్టెన్‌గా అవతరించిన చైతూకి ఆర్జే కాజల్‌, యాంకర్‌ శ్రీముఖి, నేహా చౌదరి సహా పలువురు సెలబ్రిటీల నుంచి మద్దతు ఉన్నప్పటికీ ఓటింగ్‌లో వెనకబడినట్టు తెలుస్తుంది. చివరి రెండు స్థానాల్లో యాంకర్ శివ, ఆర్జే చైతూ ఉండగా చివరికి ఆర్జేకే అతి తక్కువ ఓట్లు రావడంతో అతడిని హౌస్ నుంచి బయటకి పంపించేసినట్టు తెలుస్తుంది. మరి నిజంగానే చైతూ హౌస్ నుంచి బయటకి వస్తాడా? లేదా? అనేది మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది.

Exit mobile version