విడుదల తేదీ : ఏప్రిల్ 08, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: అదిత్ అరుణ్ (త్రిగుణ), పూజిత పొన్నాడ, గెటప్ శ్రీను, హేమంత్, మహేష్ మంజ్రేకర్, శ్యామల, వినోద్ కుమార్, సప్తగిరి, సూర్య
దర్శకత్వం : చాణక్య చిన్నా
నిర్మాతలు: మోనీష్ పత్తిపాటి
సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: వై.ఎస్.కృష్ణ
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
లేటెస్ట్ గా థియేటర్స్ లోకి వచ్చిన మరో సినిమా “కథ కంచికి మనం ఇంటికి”. యంగ్ నటీనటులు త్రిగుణ్ మరియు పూజితా పొన్నాడ లు నటించిన ఈ సినిమా ఒక హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. మరి ఈ సినిమా ఆడియెన్స్ ని ఏ మేర ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం రండి.
కథ :
ఇక కథలోకి వచ్చినట్టు అయితే.. ఈ చిత్రంలో నలుగురు ప్రధాన పాత్రలపై ప్రేమ్(త్రిగుణ్), దీక్ష(పూజిత పొన్నాడ) అలాగే మరో ఇద్దరు నంది(హేమంత్), దొంగేష్(గెటప్ శ్రీను)లపై కనిపిస్తుంది. అయితే ఈ నలుగురు కూడా ఒక్కొక్కరు ఒకో యాటిట్యూడ్ లక్ష్యాలు, తమ జీవితాలపై కేర్ లెస్ గా ఉంటారు. అలాంటి ఈ నలుగురు అనుకోని విధంగా ఒక శ్మశానంలో కలుస్తారు అక్కడ నుంచి వీరికి ఎదురయినా సంఘటనలు ఏంటి? వారు మాత్రమే కలవడానికి గల కారణం ఏమిటి? లాస్ట్ కి ఏం జరుగుతుంది అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో కనిపించేటటువంటి మెయిన్ లీడ్ లో నలుగురు నటులు కూడా మంచి పెర్ఫామెన్స్ లని అందించారు. మొదటగా హీరో త్రిగుణ్ కోసం చెప్పుకున్నట్టయితే తన ఈ సినిమాలో మంచి నటనను కనబరిచాడు.తన లుక్స్ పరంగా గాని బాడీ లాంగ్వేజ్ గాని బాగున్నాయి. అలాగే హీరోయిన్ పూజితా అయితే తనలోని బెస్ట్ ని అందించింది. స్క్రీన్ పై ఆమె అందంగా కనిపిస్తూ నీట్ గా నటనను కనబరిచింది.
ఇంకా హేమంత్ కూడా తనకిచ్చిన రోల్ ని కంప్లీట్ గా ఫుల్ ఫిల్ చేసి చూపించాడు. ఇక గెటప్ శ్రీను రోల్ అయితే సినిమాలో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. తనపై కామెడీ సీన్స్ అన్నీ కూడా బాగున్నాయి. అలాగే తన నటన కోసం చెప్పాల్సిన పని కూడా లేదు. వీరితో పాటుగా సినిమాలో ఇంపార్టెంట్ రోల్(దయ్యం) లో కనిపించిన అమ్మాయి కూడా అనేక షేడ్స్ తో సాలిడ్ పెర్ఫామెన్స్ ని అందించింది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో డ్రా బ్యాక్స్ అయితే చాలానే కనిపిస్తాయి.. ఈ సినిమా కథలో ఎలాంటి కొత్తదనం కూడా కనిపించదు. ఇలాంటి రొటీన్ ప్లాట్ లైన్స్ ని చాలా సార్లే చూసేసిందే. అలాగే సినిమాలో దర్శకుడు ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్న మెసేజ్ కూడా సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు ఇది మరో లోపం.
అలాగే స్క్రీన్ ప్లే కూడా అంత ఎంగేజింగ్ గా అనిపించదు దీనితో పలు సన్నివేశాల్లో కథనం ఇంకా ఇంట్రెస్టింగ్ గా చూపించడానికి స్కోప్ ఉన్నా అది పక్క దారి పట్టింది. అలాగే పలువురు నటుల్ని కూడా సరిగ్గా వినియోగించుకోలేకపోయారు.
ఇంకా ఈ సినిమాలో ఆశించదగ్గ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా కనిపించవు. అలాగే చాలా చోట్ల సినిమా చాలా బోర్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండాఫ్ కి వచ్చే వరకు ఈ బోర్ ఫీల్ ఆడియెన్స్ కి తప్పదు.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రం తక్కువ బడ్జెట్ చిన్న సినిమానే అయినా నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. అలాగే టెక్నికల్ టీం లో సంగీత దర్శకుడు భీమ్స్ వర్క్ మాత్రం సినిమాకి చాలా ప్లస్ అయ్యిందని చెప్పాలి. తన మ్యూజిక్ వల్ల సినిమా కొద్దో గొప్పో పలు చోట్ల ఆసక్తిగా అనిపిస్తుంది. అలాగే సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో బాగా చెయ్యాల్సింది. ఇక సినిమాలో గ్రాఫిక్స్ అయితే అంత బాగాలేవు.
ఫైనల్ గా దర్శకుడు చాణక్య చిన్నా విషయానికి వస్తే తాను సినిమాలో మెయిన్ లీడ్ కి మంచి పత్రాలు రాసుకొని వాటిని బాగానే ప్రెజెంట్ చేసాడు. కానీ తన కథలో కానీ కథనంలో కానీ ఎలాంటి కొత్తదనం లేవు. అదే రొటీన్ మెసేజ్ హారర్ కామెడీ కథను తీసికొచ్చాడు. పైగా దానికి డల్ నరేషన్ మరో పెద్ద మైనస్ అయ్యింది. ఓవరాల్ గా అయితే తన వర్క్ ఇంప్రెస్ చెయ్యదు.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “కథ కంచికి మనం ఇంటికి” చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. అక్కడక్కడా కొన్ని నవ్వులు మెయిన్ లీడ్ నలుగురు నటుల సిన్సియర్ పెర్ఫామెన్స్ లు ఆకట్టుకుంటాయి. ఇక మిగతా అంతా పరమ రొటీన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కనిపిస్తుంది. ఇలా ఈ సినిమా ఒక బిలో యావరేజ్ ఫ్లిక్ గా నిలిచిపోయింది.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team