సమీక్ష : “బీస్ట్” – బోరింగ్ యాక్షన్ డ్రామా!

Beast Movie Review

విడుదల తేదీ : ఏప్రిల్ 13, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, సెల్వరాఘవన్, యోగి బాబు తదితరులు

దర్శకత్వం : నెల్సన్ దిలీప్‌ కుమార్

నిర్మాతలు: సన్ పిక్చర్స్

సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్

సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస

ఎడిటర్ : ఆర్. నిర్మల్

‘నెల్సన్ దిలీప్ కుమార్’ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా వచ్చిన సినిమా ‘బీస్ట్’. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

 

కథ:

 

వీర రాఘవ (విజయ్) ఒక ‘రా’ ఏజెంట్. ఉమర్ ఫరూక్‌ అనే టెర్రరిస్ట్ నాయకుడిని పట్టుకునే మిషన్‌ ను వీర రాఘవ లీడ్ చేస్తాడు. ఆపరేషన్ కూడా విజయవంతమైంది. కానీ, వీరా చేసిన ఆపరేషన్ లో పొరపాటున ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోతుంది. తన వల్లే ఆ పాప చనిపోయింది అని వీర బాధపడుతూ ‘రా’ నుంచి బయటకు వచ్చేస్తాడు. కొన్ని నెలల తర్వాత జరిగిన కొన్ని సంఘటనల అనంతరం వీరాను చూసి ప్రీతి (పూజ హెగ్డే) ప్రేమలో పడుతుంది. అంతలో చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ మాల్ ను ఉగ్రవాదులు ముట్టడి చేసి ఉమర్ ఫరూక్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు. అయితే, కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వీరా కూడా ఆ సమయంలో ఆ మాల్‌ లోనే ఉంటాడు. మరి వీరా ఉగ్రవాదుల నుంచి ప్రజలను ఎలా కాపాడాడు ? వీరాకి – ఉగ్రవాదులకు మధ్య వార్ ఎలా జరిగింది ? చివరకు వీరా వాళ్ళను ఎలా గెలిచాడు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్:

 

విజయ్ తన గత చిత్రాలు కంటే భిన్నంగా ఉగ్రవాద నేపథ్యంలో ఈసారి యాక్షన్ మైండ్ గేమ్ డ్రామాతో బీస్ట్ గా వచ్చాడు. ఈ సినిమాలో విజయ్ తన లుక్స్ లో అండ్ యాక్షన్ లో ఫ్రెష్ నెస్ చూపించడానికి చేసిన ప్రయత్నం బాగుంది. ముఖ్యంగా రా ఏజెంట్ గా విజయ్ నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. పూజ హెగ్డేతో నడిచే ప్రేమ సన్నివేశాలు మరియు సాంగ్స్ లో వారి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే ఆకట్టుకుంటుంది.

ఇక దర్శకుడు నెల్సన్ రాసుకున్న మెయిన్ పాయింట్,కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. మాల్ లో విజయ్ – యోగిబాబుకి మధ్య సాగే కామెడీ సన్నివేశాలు కొన్ని చోట్ల నవ్విస్తాయి. విలన్ గా నటించిన నటుడితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. మొత్తమ్మీద ఉగ్రవాదులకు సంబంధించిన సీన్స్ తో మరియు కొన్ని యాక్షన్ సీన్స్ తో ఈ చిత్రంలో కొన్ని ఎలిమెంట్స్ పర్వాలేదనిపిస్తాయి. సెకండాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాలలో దర్శకుడు హార్డ్ వర్క్ కనిపిస్తోంది.

 

మైనస్ పాయింట్స్:

 

సినిమాలో తీసుకున్న మెయిన్ పాయింట్ బాగున్నా.. పెద్దగా కథ లేకపోవడం కథనం కూడా రెగ్యూలర్ మాస్ మసాలా మూవీలా మరీ లాజిక్స్ లేకుండా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిదంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఇక చెన్నై లాంటి మహానగరంలో టెర్రరిస్ట్ లు ఓ ప్రముఖ మాల్ ను హైజాక్ చేయడం.. దాని చుట్టే కథను మొత్తం చుట్టేయడం..అలాగే సినిమాలో హైజాక్ ను చూపించినట్లు అంతదారుణమైన పరిస్థితులు ఈ డిజిటల్ విప్లవంలో ఎక్కడా జరగవు. సాధ్యం కావు.

అయితే, సినిమాలో కొన్ని సోషల్ ఎలిమెంట్స్ తో పాటు సినిమాలో చాలా చోట్ల స్టైలిష్ మేకింగ్ మరియు ఇంట్రస్ట్ అంశాలు ఉన్నప్పటికీ.. నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి.. దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తోంది. సినిమాలో ఉన్న ల్యాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ పై ఎక్కువ వర్క్ చేయాల్సింది. పైగా హీరోయిన్ పాత్ర కూడా బలంగా అనిపించదు. హీరో హీరోయిన్ల మధ్య లవ్ డ్రామాను ఇంకా బలంగా రాసుకోవాల్సింది.

 

సాంకేతిక విభాగం:

 

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ద‌ర్శ‌కుడు నెల్సన్ క‌మ‌ర్షియ‌ల్ అంశాలకి సామాజిక అంశాలు కలిపి ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడు. అయినప్పటికీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాను చూసిన ఫీలింగే వస్తుంది. అయితే దర్శకుడు తెరకెక్కించిన యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. సినిమాలో చాల చోట్ల లాజిక్స్ మిస్ కాకుండా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. ఇక సంగీతం విషయానికి వస్తే.. పాట‌లు ఫర్వాలేదనిపిస్తే, నేప‌థ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్ర‌ఫర్ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ చాలా ఎఫెక్టివ్ గా తీశారు. సినిమాలోని నిర్మాణ విలువ‌లు కూడా బాగున్నాయి.

 

తీర్పు:

 

భారీ అంచనాల మధ్య పక్కా యాక్షన్ డ్రామాతో బీస్ట్ గా వచ్చిన విజయ్, తన యాక్టింగ్ అండ్ యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. అలాగే, సినిమాలో కొన్ని చోట్ల కామెడీ పర్వాలేదనిపిస్తోంది. అయితే.. కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నెరేషన్ తో సాగడం, ముఖ్యంగా సింపుల్ స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. సినిమాలో కీలక సన్నివేశాలను సాగదీయకుండా, ప్రేమ కథలో ఇంకాస్త డెప్త్ పెంచి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. మొత్తమ్మీద ఈ చిత్రంలో కొన్ని యాక్షన్ అంశాలు విజయ్ ఫ్యాన్స్ కు కనెక్ట్ అవుతాయి. కానీ ఈ సినిమా మాత్రం ఆకట్టుకోదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version