త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “భీమ్లా నాయక్”

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హ్యాండ్సం హంక్ రానా దగ్గుపాటి లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం లో సంయుక్త మీనన్, నిత్య మీనన్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. త్వరలో ఈ చిత్రం స్టార్ మా లో ప్రసారం కానుంది. రీమేక్ చిత్రం అయినప్పటికీ మంచి వసూళ్లను సాధించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version