సమీక్ష : కిన్నెరసాని – జీ 5 లో తెలుగు చిత్రం

Kinnerasani  Movie Review

విడుదల తేదీ : జూన్ 10, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: కళ్యాణ్ దేవ్, రవీంద్ర విజయ్, అన్ షీతల్, కాషిష్ ఖాన్

దర్శకత్వం : రమణ తేజ

నిర్మాత: రామ్ తాళ్లూరి

సంగీత దర్శకుడు: సాగర్ మహతి

సినిమాటోగ్రఫీ: దినేష్ కే. బాబు

ఎడిటర్: అన్వర్ అలీ

కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన కొత్త చిత్రం కిన్నెరసాని. ఈ చిత్రం నేడు జీ 5 లో డైరెక్ట్ డిజిటల్ ప్రీమియర్ గా విడుదల అయ్యింది. ప్రస్తుతం జీ 5 లో ప్రసారం అవుతున్న ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ:

వేద (అన్ శీతల్) హైదరాబాద్‌లో ఒక చిన్న లైబ్రరీని ప్రారంభిస్తుంది. ఒక రోజు, ఆమె తన స్వంత తండ్రి (రవీంద్ర విజయ్) మరణానికి ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు తెలియజేసే ఒక పుస్తకాన్ని ఆమె చూస్తుంది. కలత చెందిన వేద, లాయర్ అయిన విక్రమ్ (కళ్యాణ్ దేవ్) సహాయం కోరుతుంది, అతను పుస్తకంలో వ్రాసిన కథకు కనెక్ట్ అవుతాడు. ఈ పుస్తకం దేని గురించి? వేదకి పుస్తకానికి ఉన్న సంబంధం ఏమిటి? ఆమె తండ్రి మరణానికి ఎందుకు ప్రతీకారం తీర్చుకుంటుంది? మరియు విక్రమ్ ఆమెను రక్షించడానికి ఎలా వస్తాడు? ఇవన్నీ తెలియాలంటే జీ 5లో సినిమాను చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

సాయి తేజ రాసిన బేసిక్ ప్లాట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మలయాళ నటి అన్ శీతల్ కీలక పాత్రలో నటించింది, మరియు ఆమె వేద పాత్రలో బాగా ఆకట్టుకుంది. అన్ని ఉత్కంఠభరితమైన సన్నివేశాలలో ఆమె నటించిన విధానం సినిమాను చాలా హైలెట్ చేసింది.

కాశిష్ ఖాన్ రెండవ ప్రధాన పాత్రను పోషించడం జరిగింది. హీరో కళ్యాణ్ దేవ్ తో కాశీష్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. కళ్యాణ్ దేవ్ తన గత చిత్రం సూపర్ మచ్చి తో పోలిస్తే కొంచెం బెటర్ గా నటించాడు అని చెప్పాలి. అతను ఇంటెన్స్ యాక్టింగ్ తో బెస్ట్ ఇచ్చాడు అని చెప్పాలి. సినిమా లో తన పాత్రకి న్యాయం చేశాడు అని చెప్పాలి.

మెయిన్ విలన్ గా నటించిన రవీంద్ర విజయ్ సినిమాకి బెస్ట్ పార్ట్ అని చెప్పాలి. కీలక సన్నివేశాలలో అతని నటన ఈ థ్రిల్లర్‌ను మరింత ఆసక్తి గా ఉంచింది. రవీంద్ర విజయ్ అన్ని జైల్ సీక్వెన్స్‌లలో చాలా బాగా చేయడం మాత్రమే కాకుండా, తన ఇంటెన్స్ లుక్ మరియు మంచి వాయిస్ ద్వారా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాడు.

మైనస్ పాయింట్స్:

కథాంశం బాగున్నప్పటికీ, స్క్రీన్ ప్లే మరింత గ్రిప్పింగ్‌గా ఉండాలి. సెకండాఫ్‌లో పెద్దగా ట్విస్ట్‌లు లేకపోవడంతో సినిమా పై కాస్త ఆసక్తి తగ్గుతుంది.

క్రైమ్ సెటప్ ఫస్ట్ హాఫ్‌లో బాగా హ్యాండిల్ చేయడం జరిగింది. కానీ, చివరి భాగంలో అంత గ్రిప్పింగ్ గా సాగదు. మరింత గ్రిప్పింగ్ థ్రిల్స్ మరియు డ్రామా ప్రీ క్లైమాక్స్‌ లో సన్నివేశాలను మరింత మెరుగ్గా ఎలివేట్ చేసి ఉండేవి.

కళ్యాణ్ దేవ్ పాత్ర సరిగ్గా ఉపయోగించుకోలేదు అని చెప్పాలి. కథలో ప్లాట్ నుండి కొంచెం డిస్‌కనెక్ట్ అయినట్లు కనిపిస్తోంది. కథ ఒక పుస్తకంతో మొదలవుతుంది. దానికి సంబంధించిన ఆచూకీని మరింత మెరుగైన పద్ధతిలో ఏర్పాటు చేసి ఉండాలి.

సాంకేతిక విభాగం:

సాగర్ మహతి సంగీతం పర్వాలేదు అని చెప్పాలి. కానీ అతను సినిమాకి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకాస్త బాగుండే అవకాశం ఉంది. సినిమాలో పెద్దగా ల్యాగ్స్‌ లేకపోవడంతో ఎడిటింగ్‌ చాలా బాగుంది. సాయి తేజ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ లో ఎఫెక్టివ్ గా ఉంది.

దర్శకుడు రమణ తేజ విషయానికి వస్తే, అతను సినిమాతో తన దర్శకత్వ ప్రతిభ నిరూపించుకున్నాడు. అతని కథాంశం బాగుంది కానీ అతని కథనం మరింత నాటకీయ భావోద్వేగాలతో గ్రిప్పింగ్ అయి ఉండాలి. సినిమా చెడ్డదని కాదు కానీ థ్రిల్లర్‌లకు అవసరమైన బలమైన పంచ్ ఇందులో లేదు.

తీర్పు:

మొత్తమ్మీద, కిన్నెరసాని ఫస్ట్ హాఫ్‌లో ఆసక్తికరమైన సెటప్ మరియు పాస్ అయ్యే థ్రిల్స్ ఉన్నాయి. కానీ సెకండాఫ్‌లో అవసరమైన డ్రామా, సస్పెన్స్ లేకపోవడంతో కాస్త డల్‌గా అనిపిస్తుంది. మీరు ఈ అంశాలను విస్మరిస్తే, ఈ వారాంతం ఈ సినిమా బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Exit mobile version