విడుదల తేదీ : జూన్ 23, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు: త్రిగుణ్, ఇర్రా మోర్, పృధ్వీ రాజ్, ప్రశాంత్ కార్తీ, పార్వతి అరుణ్, రామ్ ప్రసాద్
దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
నిర్మాత: కొండా సుస్మిత పటేల్
సంగీత దర్శకుడు: డిఎస్ఆర్ బాలాజీ
సినిమాటోగ్రఫీ: మల్హర్భట్ జోషి
ఎడిటర్: మనీష్ ఠాకూర్
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొన్నాళ్ల నుంచి మళ్ళీ పలు సినిమాలు తీస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అలా ఆర్జీవీ తీసిన లేటెస్ట్ చిత్రం “కొండా”. మరలా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన ఈ చిత్రంతో వర్మ ఎంతవరకు మెప్పించాడో సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
ఇక కథలోకి వచ్చినట్టు అయితే.. తెలంగాణకి చెందినటువంటి కొండా(త్రిగుణ్) తనదైన ఐడియాలిజీ లతో యువతను ప్రభావితం చేస్తూ యువ కెరటంలా దూసుకెళ్తూ ఉంటాడు. అయితే కొండా తీరుని చూసి పలువురు ప్రముఖులు వారి దళంలోకి అతడిని చేర్చుకునే యత్నం కూడా చేస్తారు. మరి ఈ క్రమంలోనే నల్లా సుధాకర్(పృథ్వి) కొండా ని తన పార్టీలో చేరమని ఆహ్వానిస్తాడు. అయితే కొండా అందులో చేరుతాడు కానీ తనను ఒక పావుగా వినియోగించుకోడానికి చేర్చుకున్నారు అనేది ముందు పసిగట్టలేకపోతాడు. కానీ తర్వాత ఇద్దరికీ పడకపోవడంతో తాను దూరంగా ఉంటాడు దీనితో కొండా ని ఎలాగైనా చంపించాలని సుధాకర్ ప్లాన్ చేస్తాడు. మరి ఈ ట్రాప్ నుంచి కొండా ఎలా తప్పించుకున్నాడు? తన రాజకీయ ప్రస్థానం చివరికి ఏమయ్యింది అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
వర్మ సినిమాల్లో ముఖ్యంగా ఈ తరహా నిజ జీవిత ఘటనల చిత్రాల్లో క్యాస్టింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది. పైగా వారి నటన పరంగా కూడా తాను మంచి పెర్ఫామెన్స్ లను రాబడతాడు. సరిగ్గా ఈ సినిమాలో కూడా అదే జరిగింది. కొండా రోల్ లో చేసిన త్రిగుణ్ డీసెంట్ లుక్స్ తో మంచి యాటిట్యూడ్ లో కనిపించి ఆకట్టుకుంటాడు. అలాగే 30 ఇయర్స్ పృద్వికి ఈ చిత్రంలో సాలిడ్ రోల్ దొరికింది అని చెప్పాలి.
రీసెంట్ గా తాను చేస్తున్న కామెడీ రోల్స్ కి భిన్నంగా ఇది బాగుంటుంది. ఇంకా ఆటో రామ్ ప్రసాద్ నుంచి కూడా మంచి రోల్ కనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాలో నటి ఇర్రా మోర్ కోసం ప్రత్యేకంగా చెప్పుకొని తీరాలి. కొండా సురేఖ పాత్రలో ఆమె నటించింది. పర్టిక్యులర్ గా ఈమెపై మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని మ్యాచ్ చేస్తూ అయితే తాను మంచి నటనను కనబరిచింది. తన నుంచి మాత్రం సాలిడ్ వర్క్ గా ఇది తన కెరీర్ లో నిలుస్తుంది అని చెప్పాలి.
మైనస్ పాయింట్స్ :
ముందు చెప్పినట్టుగా బియోపిక్స్ పరంగా వర్మ మెయిన్ కాస్ట్ వరకు పర్ఫెక్ట్ నటీనటులను తీసుకుంటాడు కానీ మిగతా నటీనటుల విషయంలో మాత్రం ఎందుకు మరీ అంత తక్కువ క్వాలిటీ నిర్ణయాలు తీసుకుంటాడో అతనికే తెలియాలి. మెయిన్ లీడ్ మినహాయిస్తే మిగతా అంతా ఏమాత్రం ఆకట్టుకోరు.
ఇంకా వర్మ అయితే ఇలాంటి సినిమాలు ముందు కూడా చేసాడు కానీ వాటిని బట్టి చూస్తే ఈ చిత్రంలో ఎలాంటి కొత్త ట్రీట్మెంట్ తన మార్క్ లో కనిపించదు. అలాగే సెకండాఫ్ లోకి వచ్చినట్టు అయితే హీరో త్రిగుణ్ విషయంలో చాలా అజాగ్రత్తలు కనిపిస్తాయి. సరైన ఫోకస్ తన రోల్ పై ఎక్కడా కనిపించదు. అలాగే ముఖ్యంగా ఈ సినిమాలో అసలైన ఎమోషన్ ని వర్మ ఎక్కడా బలంగా ఎస్టాబ్లిష్ చెయ్యకపోవడం గమనార్హం.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రంలో కూడా రీసెంట్ గా వర్మ నుంచి వస్తున్న చిత్రాల్లానే బిలో యావరేజ్ నిర్మాణ విలువలు కనిపిస్తాయి. ఇంకా టెక్నీకల్ టీం లో అయితే మ్యూజికల్ వర్క్ పర్వాలేదు, పాటలు, సాహిత్యం బాగుంది. ఇంకా కాస్టింగ్ లో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది అలాగే ఎడిటింగ్ బాగాలేదు.
ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విషయానికి వస్తే ఈ సినిమాతో కూడా వర్మ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడని చెప్పాలి. మెయిన్ లీడ్ వరకు తప్పితే మిగతా ఏ అంశాల్లో కూడా తాను మెప్పించాడు. కొన్ని వర్మ మార్క్ ఓవర్ బిల్డప్ లు, ఎమోషన్స్ మిస్సవ్వడం వంటివి పూర్తిగా నిరాశ పరుస్తాయి. ఓవరాల్ గా అయితే వర్మ వర్క్ మాత్రం బిలో యావరేజ్ గానే ఉంటుంది.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “కొండా” చిత్రంలో మెయిన్ లీడ్ త్రిగుణ్ అలాగే కొండా సురేఖ పాత్రలో నటించిన ఇర్రా మోర్ లు కొంతవరకు మెప్పిస్తారు కానీ దర్శకుని వైఫల్యంతో మాత్రం సినిమా ఫలితం అంతా దెబ్బ తింది అని చెప్పాలి. వర్మ కొన్ని ఒక పావు వంతు ఆకట్టుకుంటే మిగతా అంతా తన సిల్లీ నరేషన్ తో నిరాశపరుస్తాడు. ఓవరాల్ గా అయితే ఈ సినిమా కూడా అంతగా మెప్పించదు.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team