ఈ ఏడాది మన టాలీవుడ్ దగ్గర భారీ అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ అయ్యిన చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోలుగా నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రాలు “భీమ్లా నాయక్” మరియు “రాధే శ్యామ్” లు కూడా ఒకటి. అయితే అంతా బాగుండి ఉంటే కాస్త అటు ఇటుగా రిలీజ్ కావాల్సిన చిత్రాల్లో ముందు పవన్ సినిమా రాగా తర్వాత ప్రభాస్ సినిమాలు రిలీజ్ అయ్యాయి.
అయితే వీటిలో వాటి ఫలితాలు కూడా అందరికీ తెలిసిందే. కానీ స్మాల్ స్క్రీన్ విషయానికి వస్తే “భీమ్లా నాయక్” అనుకున్న స్థాయిలో టీఆర్పీ అందుకోలేదు. కానీ ఇప్పుడు రెండో సారి టెలికాస్ట్ కి వస్తుంది. పైగా మరో పక్క అయితే “రాధే శ్యామ్” ఫస్ట్ టైం జీ ఛానెల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా అదే సమయానికి టెలికాస్ట్ అవుతుంది.
అయితే ఈ చిత్రానికి థియేటర్స్ లో అంత రెస్పాన్స్ రాలేదు కానీ ఇప్పుడు టెలివిజన్ పై అయితే ఎలా వస్తుంది అని ఆసక్తిగా మారింది. ఇంకో పక్క భీమ్లా ఫస్ట్ టెలికాస్ట్ లో రాణించలేదు. మరి ఈ రెండు సినిమాలు ఒకే సమయానికి వస్తున్నాయి దీనితో ఈ చిత్రాలు ఎలాంటి టీఆర్పీ ఇప్పుడు అందుకుంటాయా అనేది అభిమానుల్లో ఆసక్తిగా మారింది. మరి ఈ సినిమాలు ఎంత నమోదు చేస్తాయో చూడాల్సిందే.