ట్రెండింగ్ : నెట్ ఫ్లిక్స్ లో టాప్ లో దూసుకెళ్తున్న ‘మేజర్’

అడివి శేష్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా శశికిరణ్ టిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మేజర్. సోనీ పిక్చర్స్, జిఎంబి ఎంటెర్టైమెంట్స్ సంస్థలపై మహేష్, నమ్రత, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కలిసి నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక పేట్రియాటిక్ మూవీ ఇటీవల రిలీజ్ అయి పెద్ద విజయాన్ని అందుకుంది. కొన్నాళ్ల క్రితం జరిగిన ముంబై ఉగ్ర దాడుల్లో తన ప్రాణాలొడ్డి వీరోచితంగా పోరాడి అసువులుబాసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్ లో టైటిల్ రోల్ పోషించిన హీరో అడివి శేష్, ఆ పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించారు.

మేజర్ మూవీలో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంలో బాల్యం నుండి జరిగిన పలు ఘట్టాలు, ఆఖరి ముంబై దాడుల ఘటన ఇలా సినిమా ఆద్యంతం ప్రతి ఒక్క సన్నివేశం కూడా అందరి మదిని తాకుతుంది. ఇక మొన్న ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చిన మేజర్ మూవీ ప్రస్తుతం తన మేనియాని కొనసాగిస్తూ హిందీ, తెలుగు భాషల్లో టాప్ 1, 2 స్థానాల్లో కొనసాగుతోంది. మరోవైపు ఈ మూవీపై భాషాబేధం లేకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడు ప్రశంసలు కురిపిస్తూ ఇంత గొప్ప సినిమా తీసిన టీమ్ ని అభినందిస్తున్నారు.

Exit mobile version