సమీక్ష : “హ్యాపీ బర్త్ డే” – కొన్ని నవ్వులకు మాత్రమే

Happy Birthday Movie Review

విడుదల తేదీ : జులై 8, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: లావణ్య త్రిపాఠి, నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్

దర్శకత్వం : రితేష్ రానా

నిర్మాత: చిరంజీవి (చెర్రీ) & హేమలత పెదమల్లు

సంగీత దర్శకుడు: కాల భైరవ

సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్


రీసెంట్ గా సాలిడ్ బజ్ మరియు మంచి ప్రమోషన్స్ నడుమ రిలీజ్ అయ్యిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది “హ్యాపీ బర్త్ డే” సినిమా అనే చెప్పాలి. లావణ్య త్రిపాఠి, సత్య అలాగే వెన్నెల కిషోర్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని “మత్తు వదలరా” ఫేమ్ హిట్ దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించాడు. మరి ఈ సినిమా అంచనాలు అందుకుందో లేదో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ:

ఇక కథలోకి వచ్చినట్టు అయితే.. ఈ చిత్రం అంతా ఒక ఊహాజనిత ప్రపంచంలా డిజైన్ చెయ్యబడి కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో మన దేశంలో గన్స్ ని అధికారికంగా ఎవరైనా వాడుకోవచ్చు. అలాగే ఈ సమయంలో ఒక పబ్ కి హ్యాపీ(లావణ్య త్రిపాఠి) అనే అమ్మాయి సర్ప్రైజ్ పార్టీ కోసం అని వెళ్తుంది. ఇక ఇక్కడ నుంచి కొన్ని సరికొత్త పాత్రలు ఎంటర్ కావడం, డైమండ్స్ దొంగతనం జరగడం వంటి సంఘటనలు జరుగుతాయి. మరి అసలు ఈ ఊహా ప్రపంచం ఏంటి? ఇంతకీ ఇందులో ఏమయ్యింది? ఆ హ్యాపీ ఎవరు అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో ఒకింత ఆసక్తిగా అనిపించేది ఈ సినిమా లైన్ అని చెప్పాలి. స్టార్టింగ్ లోనే మంచి ఇంట్రెస్ట్ గా ఇది కనిపిస్తుంది. దీనితో మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక ఇది పక్కన పెడితే ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి తన కెరీర్ లో ఒక ఇంట్రెస్టింగ్ అండ్ బెస్ట్ రోల్ లో కనిపిస్తుంది అని చెప్పాలి.

గతంలో సినిమాల కంటే ఈ సినిమాలో ఆమె నుంచి మరింత కొత్తదనం కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా మంచి నటన, తన స్టైలిష్ లుక్స్ తో లావణ్య అయితే అదరగొడుతుంది. ఇంకా ముందు నుంచి హైలైట్ గా కనిపిస్తున్న వెన్నెల కిషోర్ మరియు కమెడియన్ సత్య లు అయితే సినిమాలో ఫన్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లారు.

ముఖ్యంగా మత్తువదలరా తర్వాత సత్య లోని మరింత కామెడీ యాంగిల్ దర్శకుడు అద్భుతంగా చూపించాడు. దాన్ని అంతే సూపర్బ్ గా సత్య కూడా కనబరిచాడు. ఇంకా ఓ కీలక నటుడి గే యాంగిల్ కనిపించి ఆకట్టుకుంటాడు. అలాగే గుండు సుదర్శన్ కి కూడా ఈ చిత్రంలో మంచి రోల్ దొరికింది. ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్, ట్రెండింగ్ ట్రోల్స్ పై కామెడీ వంటివి యూత్ కి కొంచెం బాగా కనెక్ట్ అవుతాయి.

మైనస్ పాయింట్స్:

మొదటగా ఈ తరహా సినిమాలు తీసినప్పుడు రన్ టైం అనేది చాలా కీలకం, ఇది వరకు కొన్ని హిలేరియస్ సినిమాలు చూసినా ఎక్కువ రన్ టైం ఉండి సక్సెస్ అయ్యినవి తక్కువే ఉన్నాయి. అయితే ఈ సినిమాకి కూడా రన్ టైం ఎక్కువ పెట్టారు కానీ అంతసేపు ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడంలో అంత సక్సెస్ అందుకున్నట్టు అనిపించదు.

అలాగే సినిమా రిలీజ్ కి ముందు ట్రైలర్ టీజర్ లలో హైలైట్ గా చూపించిన గన్ కల్చర్ అనేది కేవలం చిన్న పాయింట్ లా మాత్రం పరిమితం చేసేసారు. అలాగే చాలా వరకు ఓ కొత్త కామెడీ ట్రై చేసే ప్రయత్నం చేశారు కానీ అది ఎక్కడో మిస్ ఫైర్ అయ్యినట్టుగా అనిపిస్తుంది.

అక్కడక్కడా పార్ట్స్ గా చూడ్డానికి బాగానే ఉంటుంది కానీ ఆడియెన్స్ ఫైనల్ గా సినిమాలో ఏం నడుస్తుంది అనేది అర్ధం కాదు. లీనియర్ అంటూ ప్రొజెక్ట్ చేసిన ఈ సినిమా ఇంకా కాస్త డీటైలింగ్ ఇచ్చి ఉంటే వారు అనుకున్న స్థాయిలో రీచ్ అయ్యి ఉండేది. వీటితో ఒక సమయం తర్వాత బోర్ ఫీల్ తప్పక వచ్చేస్తుంది. ఇంకా చాలా వరకు కామెడీ ఓవర్ గా బాగా సిల్లీగా ఉన్నట్టు కూడా కనిపిస్తాయి.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో విజువల్స్ అంతా కూడా కాస్త డిఫరెంట్ గానే కనిపిస్తాయి అలాగే ఆ సెటప్ కూడా నేపథ్యంకి తగ్గట్టుగా ఉంటుంది వీటికి తగ్గట్టే నిర్మాతలు మంచి నిర్మాణ విలువలు అందించారని చెప్పాలి. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సురేష్ సారంగం ఇచ్చిన సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే కాల భైరవ ఈ తరహా సినిమాలకి ఇచ్చే తన మార్క్ ట్రెండింగ్ ట్యూన్స్ మరియు స్కోర్ ని అందించాడు. అలాగే డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఇంకా ఎడిటింగ్ వర్క్ అయితే బాగాలేదు.

ఇక దర్శకుడు రితేష్ విషయానికి వస్తే ఒక డార్క్ థీమ్ లో మంచి కామెడీతో గతంలో అలరించిన తాను ఈసారి కూడా ఒక కొత్త ప్రయత్నం చేయడం హర్షనీయమే కానీ ఈ సినిమాకి మాత్రం తన యత్నం అంత సక్సెస్ కాలేదు. చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఉండే స్క్రీన్ ప్లే, పలు చోట్ల డల్ సాగే కథనం, సిల్లీ కామెడీలు ఆడియెన్స్ కి చికాకు పుట్టించేలా చేస్తాయి. కొన్ని చోట్ల కామెడీ వరకు ఓకే గాని ఇతర కీలక అంశాల్లో బెటర్ వెర్షన్ ని మంచి డీటెయిల్స్ తో చూపించి ఉంటే సినిమా ఫలితం వేరేలా ఉండేది.

తీర్పు:

ఇక ఫైనల్ గా చూసినట్టు అయితే ఈ “హ్యాపీ బర్త్ డే” లో లావణ్య త్రిపాఠి, కమెడియన్ సత్య సహా వెన్నెల కిషోర్ కొంతమంది నటుల కామెడీ సహా పెర్ఫామెన్స్ సాలిడ్ గా ఆకట్టుకుంటాయి. కానీ సినిమాలో సరైన కథనం, నిడివి లాంటివి పర్ఫెక్ట్ గా కుదరకపోవడం వల్ల చాలా మేర బోర్ ఫీల్ కలుగుతుంది. ఇవి దృష్టిలో పెట్టుకొని కొన్ని నవ్వుల కోసం మాత్రమే అయితే ఈ వారాంతానికి ఒక్కసారి ఈ సినిమా చూడొచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version