పురాణపండ ప్రతీ పదమూ ఒక మంత్ర దీక్షే !

మేడపాటి రవీందర్ ‘ యుగే యుగే ‘ ఆవిష్కరించిన ఈ.ఓ సూర్యకళ

విశాఖపట్నం : జూలై ; 17

సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠిస్తూ,మానవ జీవన మానసిక వ్యవస్థని బలపరిచి ఆత్మశక్తినిచ్చే నారసింహుని మంత్రమయ కథా వైభవ శక్తుల్ని అపూర్వంగా అందించిన పురాణపండ శ్రీనివాస్ ” యుగే …. యుగే ‘ మహోత్తమ గ్రంధాన్ని ఆవిష్కరించడం తనకు నృసింహ కటాక్షంగా భావిస్తున్నామని సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి ఎం.వి. సూర్యకళ పేర్కొన్నారు. దక్షిణాయన ప్రవేశ పుణ్యదిన సందర్భంగా ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనం ‘ యుగే … యుగే ” మహోన్నత గ్రంధాన్నిఆదివారం ఉదయం నృసింహ సన్నిధిలో ఆమె ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీమతి సూర్యకళ మాట్లాడుతూ పురాణపండ శ్రీనివాస్ ఒక్కొక్క మహాగ్రంధం ఒక్కొక్క మంత్ర దీక్షకు తలుపులు తీరుస్తుందని పేర్కొంటూ, ప్రాచీన కాలంలో శాస్త్ర మర్యాదల్ని బోధించి , సనాతన విద్యలతో జ్ఞాన శరీరాన్ని ప్రసాదించే వారని ఈ ‘ యుగే యుగే ‘ గ్రంధాన్ని ప్రచురించే భాగ్యానికి నోచుకున్న విశాఖ నగర భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు మేడపాటి రవీందర్ ని అభినందించారు .

గ్రంథ సమర్పకులు, భారతీయ జనతా పార్టీ విశాఖ పార్లమెంటరీ నాయకులు మేడపాటి రవీందర్ మాట్లాడుతూ తన తల్లితండ్రుల ఆశీర్వచనం వల్లనే తాను ఈ పుణ్య గ్రంధాన్ని సమర్పించగలిగానని , ఈ అంశంలో పురాణపండ శ్రీనివాస్ ప్రోత్సాహ చైతన్యం మరువలేనని కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇంకా ఈ కార్యక్రమంలో స్థానాచార్యులు డాక్టర్ టి. రాజగోపాల్ , ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. ఆనందకుమార్ , పర్యవేక్షకులు ఎస్. మహేష్ , దేవస్థానం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అప్పల నాయుడు, పలువురు ఆరెస్సెస్ ప్రముఖులు , భారతీయ జనతాపార్టీ నాయకులు పాల్గొన్నారు.

Exit mobile version