సాయి పల్లవి ‘గార్గి’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ …. !

స్టార్ నటి సాయి పల్లవి లేటెస్ట్ గా నటించిన మూవీ గార్గి. తప్పు చేసింది మనవాళ్లే అయినా వదిలిపెట్టకూడదనే మెసేజ్ తో తెరకెక్కిన ఈ మూవీలో సాయి పల్లవి తన అత్యద్భుత పెర్ఫార్మన్స్ తో అందరినీ ఎంతో ఆకట్టుకున్నారు. ఇటీవల మలయాళం, తెలుగు, తమిళం లో ఈ మూవీని రిలీజ్ చేసారు.

అయితే ఆశించిన స్థాయి విజయాన్ని ఈ మూవీ అందుకోలేదు. యాక్షన్ ఎమోషనల్ మూవీ గా తెరకెక్కిన గార్గిని గౌతమ్ రామచంద్రన్ తెరకెక్కించగా తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ వారు దగ్గుబాటి రానా సమర్పణలో విడుదల చేసారు. కాగా ఈ మూవీని ప్రముఖ ఓటిటి కంపెనీ సోనీ లైవ్ వారు ఈనెల 12వ తేదీన దీనిని బుల్లితెర ప్రేక్షకుల ముందుకి తీసుకురానునంట్లు కొద్దిసేపటి కృతం అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. మరి ఈ మూవీ ఎంత మేర ఒటిటి ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.

Exit mobile version