ఓటిటి సమీక్ష : “డార్లింగ్స్” – హిందీ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో

 Darlings  Movie Review

విడుదల తేదీ : ఆగష్టు 05, 2022

123telugu.com Rating : 3.25/5

నటీనటులు: అలియా భట్, షెఫాలీ షా, విజయ్ వర్మ, రోషన్ మాథ్యూ

దర్శకత్వం: జస్మీత్ కె. రీన్

నిర్మాతలు: అలియా భట్, గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ

సంగీత దర్శకులు: ప్రశాంత్ పిళ్లై, విశాల్ భరద్వాజ్, మెల్లో డి

సినిమాటోగ్రఫీ : అనిల్ మెహతా

ఎడిటర్: నితిన్ బైద్


బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయినటువంటి ఆలీ భట్ ప్రొడక్షన్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన చిత్రం “డార్లింగ్స్”. తాను నటించి, బాలీవుడ్ లో మంచి బజ్ తో డైరెక్ట్ ఓటిటి లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

ఇక ఈ సినిమా కథలోకి వచ్చినట్టు అయితే.. హంజా షైక్(విజయ్ వర్మ) అలాగే బద్రునిషా షైక్(ఆలియా భట్) ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. ఇలా ఒక గుడ్ స్టార్ట్ తో మొదలైన వీరి వివాహ బంధంతో ముంబైలో ఓ ఫ్లాట్స్ లోకి షిఫ్ట్ అవుతారు. తర్వాత కొన్నాళ్ళకి హంజా తన అసలు రూపాన్ని బయటపెట్టి తన భార్య ని హింసించడం మొదలు పెడతాడు. దీనితో బద్రునిషాకి ఏమీ అర్ధం కానీ పరిస్థితిలోకి వెళుతుంది. దీనితో తన కాలనీ లోనే ఉంటున్న తన అమ్మకి ఈ విషయం చెప్పగా ఆమె అతన్ని చంపెయ్యాని చెబుతుంది. మరి దీనితో నిషా ఏం చేసింది? తన తల్లి చెప్పినట్టే తన భర్తని చంపుతుందా లేక తాను వేరే నిర్ణయం ఏమన్నా తీసుకుంటుందా అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఆలియా తన లాస్ట్ సూపర్ హిట్ చిత్రం గంగూబాయి ఖాటియావాడి లో ఎలాంటి నటన కనబర్చిందో చూసాము. చాలా అగ్రెసివ్ నటనతో తన కెరీర్ లో ఒక బెస్ట్ పెర్ఫామెన్స్ ని అయితే ఆమె అందించింది. మరి ఇక ఈ సినిమా అయితే దానికి కొనసాగింపు అని చెప్పాలి.

ఆ సినిమా తరహాలో సాలిడ్ పెర్ఫామెన్స్ ఆమె కనబరిచింది. అలాగే తన నటనతో అయితే డెఫినిట్ గా మళ్ళీ తన అభిమానులు సహా ఆడియెన్స్ ని ఈ చిత్రంతో ఆశ్చర్యపరుస్తుంది. ఇక నటుడు విజయ్ వర్మ కూడా తన పాత్రని అద్భుతంగా చేసాడు. తన రోల్ లోని డార్క్ షేడ్స్ ని చాలా క్లీన్ గా ప్రభావవంతంగా చేసి రక్తి కట్టించాడు.

అలాగే ఈ చిత్రంలో మంచి డార్క్ కామెడీ కూడా కనిపిస్తుంది, సందర్భానుసారం వచ్చే కొన్ని ఫన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. అలాగే వీఏటికి మించి ఈ చిత్రంలో కనిపించే సాలిడ్ ఎమోషన్స్ అద్భుతం అని చెప్పాలి. ఆడియెన్స్ ని కదిలించే విధంగా కొన్ని ఎమోషన్స్ అయితే ఈ సినిమాలో ఉంటాయి.

 

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రం స్టార్టింగ్ లో అంతా మంచి ఆసక్తికరంగానే ఉంటుంది కానీ తర్వాత మాత్రం కథనంలో మార్పులు సినిమాని నెమ్మదింపజేస్తాయి. దీంతో ఒక గంట తర్వాత అలా సినిమాపై ఆసక్తి తగ్గుతుంది. అలాగే మధ్యలో పలు పాత్రలు వస్తుంటాయి కానీ ఏవి కూడా అంత ఎఫెక్టీవ్ గా ఉండవు దీనితో అక్కడక్కడా బోర్ కొడుతున్న ఫీల్ కలుగక మానదు.

అలాగే చాలా వరకు సన్నివేశాలు బాగా రిపీటెడ్ గా వచ్చినట్టు కూడా అనిపిస్తాయి. ఇంకా మరికొన్ని కీలక సన్నివేశాల్లో డీటెయిల్స్ మరింత బాగా పెడితే బాగుండేది. ఇంకా ఆలియా రోల్ పడుతున్న బాధ ని బయట ప్రపంచానికి తెలిసేలా చేసి ఉంటే మరింత బెటర్ గా సినిమా అనిపించి ఉండొచ్చు.

 

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయని చెప్పాలి. సినిమా నేటివిటీకి తగ్గట్టుగా ఆలియా తీసుకున్న జాగ్రత్తలు బాగున్నాయి. ఇక టెక్నీకల్ టీం లో సంగీతం, సినిమాటోగ్రఫీ అన్నీ బాగున్నాయి. అలాగే ఎడిటింగ్ కూడా పర్వాలేదని చెప్పొచ్చు. డైలాగ్స్ మంచి ఎఫెక్టీవ్ గా అనిపిస్తాయి.

ఇక దర్శకులు జస్మీత్ విషయానికి వస్తే ఓవరాల్ తన వర్క్ మెప్పిస్తుందని చెప్పాలి. ఒక సున్నితమైన అంశాన్ని తీసుకొని దానిని మంచి ఎంగేజింగ్ గా తెరకెక్కించడంలో ఆల్ మోస్ట్ తాను సక్సెస్ అయ్యారు. అలాగే వీటితో పాటుగా మంచి డార్క్ కామెడీ కూడా యాడ్ చెయ్యడం కూడా బాగుంది. ఇంకా నటీ సాలిడ్ నటనను రాబట్టడం కూడా ఆమె దర్శకత్వానికి అద్దం పడుతుంది.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “డార్లింగ్స్” చిత్రం ఆడియెన్స్ ని మెప్పిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుత రోజుల్లో జరిగే ఓ సున్నిత అంశాన్ని మంచి ఎంగేజింగ్ ఎలిమెంట్స్ తో దర్శకురాలు చూపించడం ఆకట్టుకుంటుంది. అలాగే ఆలియా అయితే మరోసారి తన క్యాలిబర్ ని చూపించి సత్తా చాటింది. ఇంకా ఇతర నటీ నటులు కూడా మంచి సహకారం అందించడంతో అయితే ఓటిటి లో ఈ వారాంతానికి ఈ సినిమా మంచి ఛాయిస్ అవుతుందని చెప్పొచ్చు.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version