‘ఓటీటీ’ : ఈ వారం అలరించే చిత్రాలివే !

ఈ వారం కూడా ఓటీటీల్లో చాలా చిత్రాలు స్ట్రీమింగ్‌ కి రెడీ అయ్యాయి. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కాబట్టి, ఈ క్రమంలో ఈ వారంలో కూడా ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు రిలీజవుతున్నాయి. మరి వాటి పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.

ఈ వారం ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ప్రసారం అవుతున్న సినిమా :

లావణ్యా త్రిపాఠీ ప్రధాన పాత్రలో… ‘వెన్నెల’ కిశోర్, నరేష్ అగస్త్య, ‘గెటప్’ శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘హ్యాపీ బర్త్ డే’ . సోమవారం నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ అయ్యింది.

‘డే షిఫ్ట్’ యాక్షన్ ఫాంటసీ చిత్రం ఆగస్టు 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

 

ఈ వారం డిస్నీ ప్లస్ హాట్ లో ప్రసారం అవుతున్న సినిమా :

రామ్, కృతి శెట్టి జంటగా నటించిన ‘ది వారియర్’ సినిమా ఆగస్టు 11 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

అమలా పాల్ ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన సినిమా ‘కడవర్’ ఆగస్టు 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

 

ఈ వారం అమెజాన్‌ ప్రేమ్‌ లో ప్రసారం అవుతున్న సినిమా :

అక్కినేని నాగ చైతన్య ‘థాంక్యూ’ ఆగస్టు 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా నటించిన మలయాళ సినిమా ‘మలయన్‌కుంజ్’ ఆగస్టు 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

 

ఈ వారం ‘సోనీ లివ్‌’లో ప్రసారం అవుతున్న సినిమా :

సాయి పల్లవి ‘గార్గి’ సినిమా ఆగస్టు 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

 

ఈ వారం ఆహాలో ప్రసారం అవుతున్న సినిమాలు :

‘ఆహా’లో ఈ వారం రెండు డబ్బింగ్ సినిమాలు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. విజయ్ సేతుపతి నటించిన ‘మహా మనిషి’ కాగా… మరొకటి ఫహాద్ ఫాజిల్ ‘మాలిక్’. ఈ రెండు సినిమాలు ఆగస్టు 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానున్నాయి.

 

ఈ వారం జీ 5 లో ప్రసారం అవుతున్న సినిమాలు :

హిందీ సినిమా ‘రాష్ట్ర కవచ్’, పంజాబీ సినిమా ‘బ్యూటిఫుల్ బిల్లో’, కన్నడ సినిమా ‘విండో సీట్’ ఆగస్టు 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానున్నాయి.

అలాగే, బెంగాలీ సినిమా ‘శ్రీమతి’ కూడా జీ 5 ఆగస్టు 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది

Exit mobile version