ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి అరుదైన గౌరవం..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఇది అరుదైన గౌరవం అని చెప్పాలి. న్యూ యార్క్ లో జరిగే ఇండియా డే పరేడ్ కి ఈ ఏడాది యావత్ భారత్ దేశానికి ప్రతినిధిగా గ్రాండ్ మార్షల్ హోదాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ గారితో కలిసి హాజరయ్యారు. దాదాపు ఈ పరేడ్ కి ఐదు లక్షలు మందికి పైగా భారతీయలు వచ్చి, భారతదేశం పట్ల తమకున్న దేశభక్తిని, అలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై తమ్ముకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇంత స్థాయిలో న్యూయర్క్ డే పరేడ్ కి ప్రవాసులు రావడం ఓ రికార్డుగా ఇండియా డే పరేడ్ ప్రతినిధులు అభివర్ణిస్తున్నారు.

అలానే ఈ సందర్శన లో భాగంగా న్యూర్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మర్యాదపూర్వకంగా కలిశారు, వారి సంభాషణల మధ్యలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ఎరిక్ ఆడమ్, ప్రపంచ వ్యాప్తంగా విశేష జనాధరణ పొందిన తగ్గేదేలే డైలాగ్ అలానే ఫోజ్ పెట్టడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ పలు యాడ్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. నెక్స్ట్ మూవీ పుష్ప ది రూల్ చిత్రం షూటింగ్ కి సిద్దం అవుతున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version