లేటెస్ట్.. “లైగర్” ఓటిటి పార్ట్నర్ ఎవరంటే..?

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ మాస్ చిత్రం “లైగర్” కోసం అందరికీ తెలిసిందే. భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకుని రిలీజ్ అయ్యిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో మాసివ్ ఓపెనింగ్స్ అందుకోనుంది.

ఇక థియేటర్స్ లో రిలీజ్ కాక ముందు ఈ సినిమాకి భారీ ఆఫర్స్ రాగా ఇపుడు అయితే పోస్ట్ థియేట్రికల్ ఓటిటి హక్కులు సొంతం చేసుకుంది ఎవరు అనేది తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దిగ్గజ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ వారు కొనుగోలు చేసినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. దీనితో అయితే ఈ సినిమా కూడా దాదాపు 50 రోజులు తర్వాతే ఓటిటి లో అందుబాటులోకి రావొచ్చు. ఇక ఈ చిత్రానికి అయితే పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version