విడుదల తేదీ : ఆగస్టు 26, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు: హెబ్బా పటేల్, సాయి రోనక్, పూజిత పొన్నాడ, వశిష్ట ఎన్ సింహ
దర్శకత్వం : అశోక్ తేజ
నిర్మాతలు: కేకే రాధామోహన్
సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్ ఎస్
ఎడిటర్: తమ్మిరాజు
లేటెస్ట్ గా ఓటిటిలో రిలీజ్ అయ్యిన మరో కొత్త చిత్రం “ఓదెల రైల్వే స్టేషన్”. ప్రముఖ నటీనటులు హెబా పటేల్ అలాగే సాయి రోనక్, పూజిత పొన్నాడ లు నటించిన ఈ చిత్రం కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. మరి ఈ చిత్రం మన తెలుగు ఓటిటి యాప్ ఆహా లో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ :
ఇక కథలోకి వస్తే.. అనుదీప్(సాయి రోనక్) తన ఐపీఎస్ ట్రైనింగ్ నిమిత్తం ఓదెల కి చెందిన ఓ పోలీస్ స్టేషన్ లో ట్రైనింగ్ కి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఉండే ఈ ఊర్లో ఆకస్మికంగా వరుస పెట్టి అత్యాచారాలు అలాగే ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన ఆడవాళ్లపై జరగడం అలాగే వరుస హత్యలు కూడా అక్కడ కలకలం రేపుతాయి. దీనితో ఈ ఆకస్మిక పరిణామంతో పోలీసులకి ఇది పెద్ద తలనొప్పిగా మారుతుంది. మరి ఈ కేసుని పోలీసులు ఛేదిస్తారా? ఈ హత్యలు, అత్యాచారాల వెనుక ఎవరున్నారు? ఇందులో హెబా పటేల్, పూజిత పాత్రలు ఏంటి అనేది తెలియాలి అంటే ఈ సినిమా ఆహా లో చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో మేజర్ ప్లస్ ఏదన్నా ఉంది అంటే అది ఈ సినిమా నిడివి షార్ట్ గా ఉండడం అనే చెప్పాలి. దీనితో అయితే సినిమా ఎక్కువ సేపు ఉన్నట్టు అనిపించదు ఈ సినిమా నేపథ్యం వరకు ఇది ప్లస్ అనే చెప్పాలి. ఇక అలాగే సినిమాలో నటించిన నటీనటులు హెబా పటేల్, సాయి రోనక్ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనిపిస్తారు.
అలాగే సినిమా స్టార్టింగ్ లో వచ్చే ఓ సాంగ్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. ఇక అలాగే ఈ సినిమాలో మెప్పించే మరో అంశం సినిమాని చాలా రియలిస్టిక్ విజువల్స్ లో ఉన్నాయి. నేటివిటీకి తగ్గట్టుగా కాస్త సహజమైన కథనం సినిమాలో కనిపిస్తుంది. ఇంకా కొన్ని క్రైమ్ సీన్స్ ఆకట్టుకుంటాయి.
మైనస్ పాయింట్స్ :
ఈ తరహా అడాప్టెడ్ చిత్రాల్లో సహజత్వం ఏమో కానీ కల్పన ఎక్కువైతే పత్రం సినిమా ఫలితం దెబ్బ తింటుంది. అలాగే ఈ సినిమాలో కూడా చాలా సన్నివేశాలు ఎక్కడో చూసినట్టే అనిపిస్తాయి, ఆ రకంగా చిత్రీకరించారు. అలాగే సినిమాలో మెయిన్ విలన్ కి సంబంధించి ట్విస్ట్ రివీల్ అవ్వడానికి కూడా ఎంతో సమయం పట్టదు.
దీనితో పాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా చాలా సిల్లీ గా అనిపిస్తాయి. ఒక సందర్భంలో అయితే విలన్ ని పట్టుకోడానికి మంచి హింట్ దొరికినా అంత పెద్ద గ్రామంలో ఎంతో మంది ఉన్నా కూడా పోలీసులు కలిసి పట్టుకోలేకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక అలాగే సినిమాలో పాత్రా బలం పెద్దగా లేదు.
మెయిన్ లీడ్ ఉన్నారు కానీ వారి పాత్రలు బలహీనంగా కనిపిస్తాయి దర్శకుడు వీటిని మరింత ఎఫెక్టీవ్ గా రాసుకొని ఉంటే బాగుండేది. ఇక ఫైనల్ గా అయితే సినిమాకి ఎంతో కీలకమైన క్లైమాక్స్ వీక్షకులని మెప్పించే విధంగా ఉండదు. విలన్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే అంశం సరిగ్గా ఎలివేట్ కాలేదు దీనితో ఈ పాయింట్ మరింత సిల్లీ గా ఉంటుంది.
సాంకేతిక వర్గం :
ఈ సినిమాలో నిర్మాణ విలువలు అయితే బాగుంటాయి. ముఖ్యంగా సినిమా సెటప్ లో విజువల్స్ నాచురల్ గా బాగున్నాయి. ఇక టెక్నీకల్ టీం లో సినిమాటోగ్రఫీ బాగుంది. అలాగే అనూప్ సంగీతం అయితే అంతగా బాగాలేదు. తమ్మిరాజు ఎడిటింగ్ చాలా వరకు సినిమాని సేవ్ చేసింది అని చెప్పొచ్చు.
ఇక దర్శకుడు అశోక్ తేజ విషయానికి వస్తే ఈ థ్రిల్లర్ ని హ్యాండిల్ చెయ్యడంలో తాను బాగా తడబడ్డాడని చెప్పాలి. బలమైన పాత్రలు సరైన కథనం బాగా మిస్సయ్యాయి. తన వర్క్ ఇంకా బెటర్ గా రావాల్సి ఉంది. సంపత్ నంది రైటింగ్ టీం కూడా విఫలం అయ్యారు.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ఓదెల రైల్వే స్టేషన్” చిత్రంలో బాగా మెప్పించే అంశాలు అయితే తక్కువే ఉంటాయి. సరైన కథనం, పాత్రలు కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ కాకపోవడం సహా ఇతర అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. దీనితో అయితే క్రైమ్ థ్రిల్లర్ చూసేవారికి ఈ సినిమా చాలా బిలో యావరేజ్ గా అనిపిస్తుంది.
123telugu.com Rating: 2/5
Reviewed by 123telugu Team