తన కొడుకుకి స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపిన సూపర్ స్టార్!

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకరు. మహేష్ బాబు కొడుకు గౌతమ్ సైతం ఇప్పటికే 1 నేనొక్కడినే చిత్రం లో నటించారు. మహేష్ చిన్ననాటి పాత్ర ను పోషించారు గౌతమ్. అయితే నేడు గౌతమ్ పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపారు.

16 ఏళ్లు వచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది. ప్రతి రోజు నువ్వు నన్ను గర్వపడేలా చేస్తావు. గొప్ప వ్యక్తి గా ఎదగడానికి నేను వేచి ఉండలేను. ఈ కొత్త దశలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రేమ మరియు ఆశీర్వాదాలు ఉన్నాయి. నీకు అవసరం అయినప్పుడు ఎల్లప్పుడూ నేను ఉంటాను. ఐ లవ్ యూ మై సన్, మీరు ఊహించిన దాని కంటే ఎక్కువ అంటూ చెప్పుకొచ్చారు మహేష్. అయితే గౌతమ్ పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ సైతం విషెస్ తెలుపుతున్నారు.

Exit mobile version