ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర ఒక బూస్టప్ సినిమా లా నిలిచిన లేటెస్ట్ చిత్రాల్లో భారీ వసూళ్లతో అదరగొట్టిన హిట్ చిత్రం “సీతా రామం” కూడా ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ అలాగే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ లేటెస్ట్ చిత్రం వసూళ్ల పరంగానే కాకుండా ఆడియన్స్ లో కూడా ఒక క్లాసిక్ లా పేరు తెచ్చుకుంది.
మరి ఇలాంటి అద్భుతమైన సినిమాని దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించగా ఇప్పుడు ఫైనల్ గా ఈ చిత్రం ఓటిటీ లో అలరించేందుకు వచ్చేసింది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం తెలుగు, మలయాళం మరియు తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యింది. మరి ఇప్పుడు ఇందులో కూడా ఈ సినిమా చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.