రీసెంట్ గా మన టాలీవుడ్ లో వచ్చిన హిట్ సినిమాలు అందులోని క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన సాలిడ్ ఫన్ రైడ్ చిత్రం “ఎఫ్ 3” కూడా ఒకటి. తమ ముందు సెన్సేషనల్ హిట్ “ఎఫ్ 2” కి సీక్వెల్ తరహాలో ఆ ఫ్రాంచైజ్ ని స్టార్ట్ చేశారు.
మరి ఈ సినిమా థియేటర్స్ లో మంచి హిట్ గానే నిలవగా ఇప్పుడు టెలివిజన్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఈ చిత్రం శాటిలైట్ హక్కులను మన తెలుగు ప్రముఖ ఛానెల్ జీ తెలుగు ఛానెల్లో అతి త్వరలో టెలికాస్ట్ కి రానుండగా ఈ చిత్రం తెలుగుతో పాటు మరో భాషలో కూడా ప్రసారం కానున్నట్టు తెలుస్తుంది.
ఈ చిత్రం తాలూకా తమిళ్ వెర్షన్ ని జీ తమిళ్ లో టెలికాస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి రెండు భాషల్లో కూడా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరించేందుకు రెడీ అవుతుందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటించగా సోనాల్ చౌహన్, పోహా హెగ్డే లు స్పెషల్ అపీరెన్స్ లో మెరిశారు.