వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన “ఎఫ్3”


విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా, తమన్నా భాటియా, మెహ్రిన్ కౌర్ లు హీరోయిన్స్ గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ ఫన్ ఎంటర్ టైనర్ ఎఫ్3. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్దం అవుతోంది.

ఈ చిత్రం వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు లో ప్రసారం కానుంది. సోనాల్ చౌహాన్, సునీల్ లు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ డిఎస్పీ సంగీతం అందించడం జరిగింది. మరి బుల్లితెర పై ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version