లేటెస్ట్ : ముగిసిన కృష్ణంరాజు గారి అంత్యక్రియలు

టాలీవుడ్ సీనియర్ స్టార్ యాక్టర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు నిన్న తెల్లవారుఝామున హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో టాలీవుడ్ చిత్ర సీమలో విషాద ఛాయలు అలముకున్నాయి. నిన్న, నేడు పలువురు సినిమా ప్రముఖులు కృష్ణంరాజు గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అలానే మధ్యాహ్నం వరకు అభిమానుల సందర్శనార్ధం ఆయన పార్థివదేహాన్ని ఇంటివద్దనే ఉంచారు. కాగా కొద్దిసేపటి క్రితం ప్రభుత్వ లాంఛనాలతో ఎంతో ఘనంగా కృష్ణంరాజు గారి అంత్యక్రియలు జరిగాయి.

హైదరాబాద్ మొయినాబాద్, కనకమామిడి ఫామ్ హౌస్ లో ఆయన పార్థివిదేహానికి ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ అంత్యక్రియలు నిర్వహించారు. అధికారిక లాంఛనాలతో భాగంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి కృష్ణంరాజు గారికి గన్ సెల్యూట్ చేసారు. కాగా తమ అభిమాన నటుడిని చూసేందుకు కనకమామిడి ఫామ్ హౌస్ కి భారీ స్థాయిలో సినిమా ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు. అయితే ఫామ్ హౌస్ వద్దకు అనుమతి ఉన్నవారిని మాత్రమే పోలీసులు అనుమతించారు.

Exit mobile version