కమల్ హాసన్ కొత్త బ్లాక్ బస్టర్ విక్రమ్ చిత్రం మళ్లీ వార్తల్లోకెక్కింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతోంది. ఇప్పుడు ఈ సినిమా మరో ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా చోటు దక్కించుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ 5 తన ప్లాట్ ఫామ్ లో ఈ నెల సెప్టెంబర్ 13 నుంచి ఈ యాక్షన్ డ్రామాను ప్రసారం చేయబోతుంది.
దీనికి సంబంధించి అధికారికంగా కూడా ప్రకటించింది. విక్రమ్ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీలో కూడా అందుబాటులో ఉండబోతుంది. మొత్తానికి లోక నాయకుడు కమల్ హాసన్ కి ఈ లేటెస్ట్ భారీ బ్లాక్ బస్టర్ బాగా కలిసొచ్చింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా భారీ వసూళ్లతో అదరగొట్టింది. నిర్మాతగా కమల్ కి భారీ లాభాలను తెచ్చి పెట్టింది. అందుకే.. కమల్ ప్రస్తుతం నిర్మాతగా భారీ సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు.
ONE DAY TO GO. Vikram Vikram Vikraaammm
Watch #Vikram premiering on September 13 only on ZEE5.#ZEE5 #ZEE5Tamil #NaayaganMeendumVarrar #VikramOnZee5
.@ikamalhaasan
@VijaySethuOffl@Suriya_offl@itsNarain@kalidas700@SGayathrie@thilak_ramesh pic.twitter.com/2Kx492Tn16— ZEE5 Tamil (@ZEE5Tamil) September 12, 2022