ఆ ఛానెల్లో టెలికాస్ట్ కి సిద్ధంగా “అంటే సుందరానికి”.!

నాచురల్ స్టార్ నాని హీరోగా అలాగే మరో నాచురల్ హీరోయిన్ నజ్రియా ఫహద్ హీరోయిన్ గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన లేటెస్ట్ క్లీన్ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి”. మంచి అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం వసూళ్ల పరంగా అయితే ఓవర్సీస్ లో హిట్ అయ్యింది. తెలుగు తమిళ్ సహా మళయాళ భాషల్లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం.

ఇప్పుడు అయితే టెలివిజన్ పై వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అవ్వడానికి రెడీ అయ్యింది. అయితే ఈ చిత్రం శాటిలైట్ హక్కులు జెమినీ ఛానెల్ వారు సొంతం చేసుకోగా ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రసారం చేయనున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు. మరి ఈ డేట్ అయితే ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి అయితే వివేక్ ఆత్రేయ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

Exit mobile version