మెగాస్టార్ “గాడ్ ఫాదర్” డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటిటి సంస్థ!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రం ఇటీవలి కాలంలో ఎంతోమంది అసక్తి గా ఎదురు చూస్తున్న టాలీవుడ్ సినిమాల్లో ఒకటి. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో, నటుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజా గాసిప్ ఏమిటంటే, సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గాడ్ ఫాదర్ చిత్రంలో నయనతార కథానాయిక గా నటిస్తుంది. ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ బిగ్గీలో పూరీ జగన్నాధ్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అక్టోబరు 5, 2022 న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.

Exit mobile version