బిగ్ బాస్ లోకి హాట్ బ్యూటీ!

దేశ వ్యాప్తంగా బిగ్ బాస్ క్రేజ్ కొనసాగుతూనే ఉంది. ఈ బిగ్ బాస్ రియాలిటీ షో దేశం లోని వివిధ భాషల్లో ప్రారంభమైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే హిందీ వెర్షన్ పదహారవ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సీజన్ కి కూడా కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

హిందీలో బిగ్ బాస్ షో పదహారవ సీజన్ లాంఛ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ సీజన్ లో కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్రస్ అయిన హాట్ బ్యూటీ పూనమ్ పాండే కూడా షో లో ఉండనున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ OTT లో ఉర్ఫీ జావేద్‌ ను మరోసారి టీవీ వెర్షన్ కోసం తీసుకువస్తారు. ఈ ఇద్దరు హీరోయిన్లు తమ టెంపర్‌కి పేరుగాంచారు. మరియు గతంలో చాలా వివాదాలు సృష్టించారు. మరి ఈ సీజన్‌ ఎలా సాగుతుందో చూడాలి.

Exit mobile version