సమీక్ష : దుల్కర్ సల్మాన్ ‘చుప్’ – ఆకట్టుకునే గ్రిప్పింగ్ థ్రిల్లర్

 Chup Telugu Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 23, 2022

123 తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: దుల్కర్ సల్మాన్, సన్నీ డియోల్, పూజ భట్, శ్రేయ ధన్వంతరీ

డైరెక్టర్: ఆర్ బాల్కి

ప్రొడ్యూసర్స్ : రాకేష్ ఝున్ ఝున్ వాలా, అనిల్ నాయుడు, డాక్టర్ జయంతి లాల్ గడా, గౌరి షిండే

మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్ డి బర్మన్, అమిత్ త్రివేది, స్నేహ ఖన్వాల్కర్, అమన్ పంత్

సినిమాటోగ్రఫీ : విశాల్ సిన్హా

ఎడిటర్ : నయన్ ఎచ్ కె బాంద్రా

 

సంబంధిత లింక్స్ : Trailer

ఇటీవల సీతారామం మూవీతో పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న యువ నటుడు దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ గా థ్రిల్లింగ్ మూవీ చుప్ ద్వారా నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చారు. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కీలక రోల్ చేసిన ఈ మూవీ యొక్క రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

 

కథ :

ముంబై నగరం ఒక సీరియల్ కిల్లర్ యొక్క హత్యలతో అట్టుడికిపోతుంది. అయితే ఆ సీరియల్ కిల్లర్ సినిమా విశ్లేషకులని మాత్రమే పలు విచిత్రమైన కారణాలతో ఎంచుకుని మరీ హత్య చేస్తుంటాడు. ఇక ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి అరవింద్ మాథుర్ (సన్నీ డియోల్) అనే పోలీస్ అధికారిని ప్రత్యేకంగా నియమిస్తుంది పోలీస్ శాఖ. మరోవైపు డానీ (దుల్కర్ సల్మాన్) అలానే జర్నలిస్ట్ నీల మీనన్ (శ్రేయ ధన్వంతరి) ల మధ్య ప్రేమ కథ నడుస్తుంటుంది. కాగా ఆ ప్రేమికులిద్దరికీ ఈ హత్యలతో సంబంధం ఉంటుంది. అసలు ఎవరు ఈ సీరియల్ కిల్లర్, ఎందుకు సినిమా విశ్లేషకులనే ఎంచుకుని మరీ హత్య చేస్తున్నాడు, దానితో హీరో హీరోయిన్స్ కి ఏంటి సంబంధం, ఆ పైన కథ ఏమి జరిగింది, ఎటువంటి మలుపులు తిరిగింది అనేది తెర మీద చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఇప్పటివరకు తన కెరీర్ లో పోషించిన పాత్రలోతో పోలిస్తే చుప్ మూవీలో హీరో దుల్కర్ సల్మాన్ ఒక సరికొత్త పాత్రలో కనిపించారు. ఎక్కువగా చీకట్లో కనిపించే మాస్ తరహాలో సాగే పాత్ర ఆయనది, ఇక తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు దుల్కర్. చాలా గ్యాప్ తరువాత మూవీస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సన్నీ డియోల్ కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసారు. ఇక పూజా భట్ తో పాటు హీరోయిన్ గా నటించిన శ్రేయ ధన్వంతరి ఇద్దరూ కూడా తమ తమ పాత్రల యొక్క పరిధి మేరకు నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సినిమాలకు రేటింగ్స్ ఇచ్చే విశ్లేషకులని టార్గెట్ చేస్తూ సాగె కిల్లింగ్స్ అనే సరికొత్త అంశాన్ని తీసుకున్న దర్శకుడు బాల్కి, మూవీని ఆద్యంతం ఆకట్టుకునేలా నడిపారు. పోలీసులు కేసుని ఒక్కొక్క అంశం ద్వారా ఛేదించే తీరు ఆకట్టుకుంది. గ్రిప్పింగ్ గా రాసుకున్న స్క్రీన్ ప్లే ఎంతో బాగుంది. గతంలో గురు దత్ రాసిన కాగజ్ కె ఫూల్ నవలని ఇది మనకు కొంత గుర్తు చేస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

సినిమాలో ప్రధానంగా పోలీసులు హత్య కేసుని ఛేదించే విధానాన్ని ఎంతో ఆకట్టుకునేలా తీసిన దర్శకుడు బాల్కి, సెకండ్ హాఫ్ లో చాలా వరకు బాగానే తీసినప్పటికి చివరికి క్లైమాక్స్ సమయానికి వచ్చేసరికి సినిమా చాలా నార్మల్ గా ఎండ్ అవుతుంది. అది ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. కిల్లర్ కి పోలీసులకి మధ్య సాగే గేమ్ లో సన్నివేశాలు మరింత ఇంటెన్స్ గా రాసుకుని ఉంటె బాగుండేది. అలానే సినిమాలో వయొలెన్స్ తో కూడిన సన్నివేశాలు కొందరు ఆడియన్స్ కి రుచించకపోవచ్చు.

 

సాంకేతిక వర్గం :

సంగీతం, నేపధ్య సంగీతం ఈ మూవీకి ప్రధాన బలం అనే చెప్పాలి. ప్రత్యేకంగా కొన్ని సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే మరింత బాగుంది. విజువల్స్ కూడా ఎంతో బాగున్నాయి. ఇక కథ కథనాలకి ప్రధానంగా మరింత బలాన్ని ఇచ్చింది డైలాగ్స్ అనే చెప్పాలి. ఇక ముఖ్యంగా దర్శకుడు ఆర్ బాల్కి గురించి చెప్పాలి అంటే సినిమాలో ఆయన తీసుకున్న పాయింట్ ని ఆడియన్స్ నాడిని పెట్టుకునేలా తెరకెక్కించిన తీరు నిజంగా ఎంతో బాగుంది. ఆయన రాసుకున్న గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఫస్ట్ హాఫ్ లో కిల్లర్ కోసం అన్వేషణ, అలానే సెకండ్ హాఫ్ లో ఎంతో పకడ్బందీగా అతడిని పట్టుకునే తీరు ఆడియన్స్ మనసు దోస్తుంది.

 

తీర్పు :

చివరిగా చుప్ మూవీ గురించి చెప్పాలి అంటే ఇది పక్కాగా గ్రిప్పింగ్ గా సాగే థ్రిల్లర్ మూవీ అని చెప్పవచ్చు. దుల్కర్, సన్నీ డియోల్ ల అద్భుత నటన, దర్శకుడు బాల్కి సూపర్ టేకింగ్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఇలా సినిమాకి మంచి ప్లస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ వారం థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ చుప్ మూవీని ఎంచక్కా ఫామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయవచ్చు.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version