ఫైనల్ గా “బింబిసార” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా?

ఈ ఏడాది టాలీవుడ్ కి ఎట్టి పరిస్థితుల్లో భారీ హిట్ కావాలని ఎదురు చూస్తున్న సమయంలో వచ్చిన సాలిడ్ బాక్సాఫీస్ హిట్ చిత్రమే నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ట కాంబోలో వచ్చిన ఇంట్రెస్టింగ్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం “బింబిసార”. కళ్యాణ్ రామ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి తనకి మంచి బ్యాక్ ఇచ్చిన ఈ చిత్రం విజయంతో నందమూరి అభిమానులు మరింత ఆనందంగా ఫీలయ్యారు.

అయితే ఈ చిత్రం థియేటర్స్ లో అద్భుత విజయాన్ని అందుకుంది. దీని తర్వాత అయ్యితే ఓటిటి రిలీజ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు. కానీ ఇప్పుడు అయితే దీనిపై సమాచారం తెలుస్తుంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కలు జీ 5 వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈ అక్టోబర్ 7 నుంచి స్ట్రీమ్ కానున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది.

Exit mobile version