ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన అమీర్ “లాల్ సింగ్ చడ్డా”.!

ఈ ఏడాది బాలీవుడ్ నుంచి వచ్చిన ఎన్నో చిత్రాల్లో మంచి అంచనాలు పెట్టుకొని వచ్చిన చిత్రాల్లో బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం “లాల్ సింగ్ చడ్డా” కూడా ఒకటి. దర్శకుడు అద్వైత్ చందన్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ విజయాన్ని అందుకోలేదు. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చేసింది.

ఈ చిత్రాన్ని దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా మరి ఇందులో ఈ చిత్రం ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చేసినట్టు తెలియజేసారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది వరకు ఓటిటి లో రాదని ఆ మధ్య మంచి హంగామా నడిచింది. కానీ ఇప్పుడు సడెన్ స్ట్రీమింగ్ అంటూ నెట్ ఫ్లిక్స్ వారు అనౌన్స్ చేశారు. మరి అప్పుడు చూడని వారు అయితే ఈసారి చూడొచ్చు. ఇక ఈ చిత్రంలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటించగా మన టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలో నటించాడు.

Exit mobile version