తమిళ నాట స్టార్ట్ హీరో అయినటువంటి సూర్య కి మన తెలుగు లో కూడా ఎప్పుడు నుంచో మంచి ఆదరణ ఉంది. మరి తన సినిమాలతో అయితే థియేటర్స్ లో అంతా సాలిడ్ కం బ్యాక్ కోసం చూస్తుండగా రీసెంట్ గా తన మైండ్ బ్లాకింగ్ పెర్ఫామెన్స్ ఠీ విక్రమ్ నుంచి సూర్య అదరగొట్టాడు. ఇక ఆ తర్వాత నుంచి తన లైనప్ తో సూర్య మరిన్ని అంచనాలు పెంచగా రీసెంట్ గా దర్శకుడు శివ తో ఓ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని తన 42వ సినిమాగా అయితే అనౌన్స్ చేశారు.
మరి ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యిన ఈ చిత్రంపై ఇప్పుడు క్రేజీ అప్డేట్ తెలుస్తుంది. ఈ చిత్రం కేవలం డిజిటల్ హక్కులకే రికార్డు మొత్తంలో ధర పలికినట్టుగా తెలుస్తుంది. ఓ ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అయితే ఈ సినిమా హక్కులు కొనుగోలు చేయగా వారు మాత్రం ఏకంగా 100 కోట్ల భారీ మొత్తం చెల్లించి సూర్య సినిమా తీసుకున్నారట. ఇండియన్ సినిమా దగ్గరే కేవలం డిజిటల్ రైట్స్ లో భారీ మొత్తం అని చెప్పాలి. మొత్తానికి అయితే ఈ చిత్రంపై ఎనలేని హైప్ ఉందని చెప్పడానికి ఇదే ఉదాహరణ.