సమీక్ష : నీతో – స్లోగా సాగే బోరింగ్ ఎమోషనల్ లవ్ డ్రామా !

Crazy-Fellow-Movie-Review-In-Telugu

విడుదల తేదీ : అక్టోబర్ 14, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: అభిరామ్ వర్మ, సాత్విక రాజ్, రవివర్మ, సుంజిత్ అక్కినేపల్లి, నేహా కృష్ణ, కావ్య రామన్, అపూర్వ శ్రీనివాసన్, రాజీవ్ కనకాల

దర్శకత్వం : బాలు శర్మ

నిర్మాతలు: పృథ్వీ క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్

సంగీతం: వివేక్ సాగర్

సినిమాటోగ్రఫీ: సుందర్ రామ్ కృష్ణన్

ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

యువ నటీనటులు అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ హీరోహీరోయిన్లుగా, డైరెక్టర్ బాలు శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నీతో. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం..

 

కథ :

 

వరుణ్ (అభిరామ్ వర్మ) ఒక ఇన్సూరెన్స్ కంపెనీ లో ఎంప్లాయ్. అయితే, తన ఫ్రెండ్స్ తో సహా వరుణ్ టార్గెట్స్ ను రీచ్ కాలేడు. దాంతో వరుణ్ జాబ్ రిస్క్ లో పడుతుంది. ఇలాంటి సమయంలో వరుణ్ కి మేఘన (సాత్విక రాజ్) మ్యారేజ్ ఇన్సూరెన్స్ పాలసీ చేసే ఛాన్స్ వస్తోంది. 2 కోట్ల ఈ పాలసీతో వరుణ్ అండ్ అతని ఫ్రెండ్స్ జాబ్స్ సేఫ్ అవుతాయి. అయితే, అనుకోకుండా జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య మేఘన పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. అనంతరం వరుణ్ కి – మేఘన కి మధ్య రిలేషన్ బిల్డ్ అవుతుంది. ఇద్దరి మధ్య కలిగిన ఫీలింగ్స్ విషయంలో క్లారిటీ కోసం ఇద్దరు ఎదురు చూస్తుంటారు. మరీ ఈ ఇద్దరికీ తమ లవ్ విషయంలో స్పష్టత వస్తోందా ?, రాదా ?, చివరకు ఈ ఇద్దరి లవ్ స్టోరీ ఎలా సాగింది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

నీతో అంటూ సున్నితమైన అంశాలను టచ్ చేస్తూ దర్శకుడు బాలు శర్మ రాసుకున్న సున్నితమైన కథాంశం బాగుంది. అలాగే ప్రేమ కోసం హీరో – హీరోయిన్ పడే తపన మరియు కొన్ని లవ్ సీక్వెన్స్ లు.. ఇక ఎమోషనల్ గా సాగే సెకెండ్ హాఫ్ సినిమాలో ఆకట్టుకున్నాయి. కొన్ని భావోద్వేగాలతో నిండిన ఈ కథలో కొన్ని ఎమోషన్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన అభిరామ్ వర్మ చాలా బాగా నటించాడు. నటనలో మంచి ప్రతిభను కనబరిచాడు.

అభిరామ్ వర్మ లుక్స్ అండ్ పర్ఫామెన్స్ చాలా మెరుగ్గా ఉన్నాయి. తనను ప్రేమించిన అమ్మాయి పై తనకు నిజమైన ప్రేమ ఉందని తెలుసుకునే సీన్స్ లో ఆ ఫీల్ ను తన కళ్ళల్లో బాగా ఎలివేట్ చేశాడు. ప్రేమ తాలూకు బాధను అర్థం చేసుకున్నే సన్నివేశాల్లోనూ అభిరామ్ వర్మ నటన చాలా బాగుంది. హీరోయిన్ సాత్విక రాజ్ తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. హీరో బాబాయ్ పాత్రలో రాజీవ్ కనకాల నటన చాలా బాగుంది. రవివర్మ, సుంజిత్ అక్కినేపల్లి అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

నీతో సినిమా సింపుల్ పాయింట్ చుట్టూ సాగుతుంది. పైగా సినిమా కూడా అలాగే సింపుల్ గా స్టార్ట్ అవ్వడం.. పైగా, ఫస్ట్ హాఫ్ మొత్తం.. ఆ పాయింట్ చుట్టే సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని ఇంట్రెస్ట్ గా ఎలివేట్ చేయకుండా పూర్తి లవ్ ట్రాక్ పాయింటాఫ్ వ్యూలోనే స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. సినిమాలో ఆడియన్స్ కి మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కావు. దీనికి తోడు హీరో అభిరామ్ వర్మ తన లవ్ విషయంలో ఎందుకు అంత కన్ ఫ్యూజ్డ్ గా ఉన్నాడు కూడా అర్థం కాదు.

అసలు హీరో అభిరామ్ వర్మ – హీరోయిన్ సాత్విక్ రాజ్ మధ్య బలమైన కాన్ ఫ్లిక్ట్ ఏముంది ? అనే డౌట్ దగ్గరే ఆడియన్ ఉండిపోయాడు. దానికి తగ్గట్లుగానే హీరో అభిరామ్ వర్మ పాత్రకు సరైన క్యారెక్టరైజేషన్ లేకపోవడం కూడా సినిమాకు మైనస్ అయింది. అయితే, దర్శకుడు బాలు శర్మ రాసుకున్న కాన్సెప్ట్, ప్రేమ సన్నివేశాల్లోని కొన్ని ఎమోషన్స్ బాగున్నా.. అలాగే క్లైమాక్స్ సీన్స్ ఒకే అనిపించినా.. కథ కథనాలు మరీ స్లోగా సాగడంతో సినిమా ఆకట్టుకోలేకపోయింది. అదే విధంగా రెండో భాగం కథనంలో ప్లో కూడా ఇంట్రెస్టింగ్ గా లేదు.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. సినిమా క్వాలిటీ పరంగా చూసుకుంటే బాగానే ఉంది. సినిమాని విజువల్ గా పూర్తిగా ఆకట్టుకునేలా దర్శకుడు బాలు శర్మ సినిమాని తెరకెక్కించారు. కెమెరామెన్ సుందర్ రామ్ కృష్ణన్ కెమెరా పనితనం కొన్ని కీలక సన్నివేశాలల్లో చాలా బాగుంది. సినిమాకు కెమెరా వర్క్ ప్లస్ అయింది. వివేక్ సాగర్ ఇచ్చిన సంగీతం బాగుంది. అయితే, ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ ల్యాగ్ సీన్స్ ను స్మూత్ కట్ చేసి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాతలు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

తీర్పు :

 

నీతో అంటూ ప్యూర్ లవ్ థీమ్ తో ఎమోషనల్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో కొన్ని ఎమోషన్స్, కొన్ని ప్రేమ సన్నివేశాలు పర్వాలేదు అనిపించినా.. ఈ సినిమా ఆకట్టుకోదు. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో కీలకమైన సీన్స్ బోర్ గా సాగడం, అలాగే వెరీ స్లో నేరేషన్, మరియు సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ కావడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఐతే, అభిరామ్ వర్మ, సాత్విక రాజ్ నటన బాగుంది. మొత్తమ్మీద ఈ ‘చిత్రం’ ప్రేక్షకులకు కనెక్ట్ కాదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version