విజయ్ నెక్స్ట్ లెవెల్ మాస్ డాన్స్ చూడటానికి రెడీ గా ఉండండి – జానీ మాస్టర్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా, డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం వరిసు. తెలుగు లో వారసుడు పేరుతో ఏకకాలం లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12, 2023 న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అందుకు సంబంధించిన ప్రమోషన్స్ ను సైతం వేగవంతం చేయడం జరిగింది.

అయితే ఈ చిత్రం లో మాస్ నెంబర్ కు కొరియోగ్రఫీ చేస్తున్న జానీ మాస్టర్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తలపతి విజయ్ సార్ అభిమానులు, నా మాటలను గుర్తు పెట్టుకోండి, విజయ్ గారి నెక్స్ట్ లెవెల్ మాస్ డాన్స్ ను చూడటానికి సిద్ధం గా ఉండండి. దీన్ని థియేటర్ల లో ఎవరూ కూర్చోని చూడలేరు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక తను కొరియోగ్రఫీ చేస్తున్న ఒక స్టిల్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. జాని మాస్టర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ చిత్రం లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version