అక్టోబర్ 21న ‘బింబిసార’ గ్రాండ్ ఓటిటి రిలీజ్

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఇటీవల సోషియో ఫాంటసీ మూవీ గా గ్రాండియర్ విజువల్స్ తో, హై టెక్నీకల్ వాల్యూస్ తో తెరకెక్కి అద్భుత విజయం అందుకున్న మూవీ బింబిసార. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ చేయగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె హరికృష్ణ ఈ మూవీని ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. యువ దర్శకుడు మల్లిడి వశిష్ట ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అయి, ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ కొట్టారు. ఇక ఈ మూవీ ఈ నెల 21న ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ 5 ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఇక ఈ మూవీ ఒటిటి రిలీజ్ పై నేడు జీ 5 చీఫ్ బిజినెస్ అధికారి మనీష్ కల్రా మాట్లాడుతూ, ఇటీవల తమ ఓటిటి లో రిలీజ్ అయి మంచి క్రేజ్ సొంతం చేసుకున్న కెప్టెన్, విక్రాంత్ రోణా, కార్తికేయ 2 తరువాత త్వరలో తమ ఆడియన్స్ ముందుకి వస్తున్న మైథలాజికల్ విజువల్ గ్రాండియర్ మూవీ బింబిసార కూడా సూపర్ రెస్పాన్స్ ని అందుకుంటుందని నమ్మకం వ్యక్తం చేసారు. ఇప్పటికే థియేటర్స్ లో చూసినప్పటికీ కూడా బింబిసార ఓటిటి రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, తమ సినిమా అటు థియేటర్స్ లో ఎంతో అద్భుతంగా విజయం అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, అలానే ఇటు ఓటిటి లో కూడా మూవీ కోసం ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉందని, థియేటర్స్ లో దీనిని మిస్ అయిన వారు తప్పకుండా జీ5 ఓటిటిలో ఎంతో ఎంజాయ్ చేస్తారని, తాను కూడా ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఎదురుచూస్తున్నానని చెప్పారు.

దర్శకుడు మల్లిడి వశిష్ఠ మాట్లాడుతూ, ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవడంతో పాటు ఫస్ట్ మూవీతోనే హీరో కళ్యాణ్ రామ్ గారి తో వర్క్ చేయడం మెమొరబుల్ ఎక్స్ పీరియన్స్ అని, అలానే తనకు సోషియో ఫాంటసీ సినిమాల మీద ఉన్న ఆసక్తిని గమనించి ఈ సినిమా స్టోరీ విని, అది ఎంతో నచ్చడంతో సినిమా చేసిన హీరో కళ్యాణ్ రామ్ గారికి, టీమ్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. అలానే థియేటర్స్ లో సూపర్ గా సక్సెస్ అయిన బింబిసారని తప్పకుండా ఈ నెల 21న జీ5 ఓటిటి లో చూసి ఎంజాయ్ చేయండి అని అన్నారు. ఇప్పటికే పలు రకాల సినిమాలు, వెబ్ సిరీస్, ఒరిజినల్ సిరీస్ సినిమాలతో ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటూ డిజిటల్ మాధ్యమాల్లో తమకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకుంది జీ5 సంస్థ. కాగా బింబిసార మూవీ తెలుగుతో పాటు అక్టోబర్ 21న జీ5 లో తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.

Exit mobile version