కార్తీ “సర్దార్” శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ టీవీ ఛానల్!


కోలీవుడ్ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్ తమిళం మరియు తెలుగు భాషలలో విడుదలై ప్రేక్షకులని, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తీ ద్విపాత్రాభినయం చేశారు. అయితే ఈ సినిమా హక్కులను ప్రముఖ ఎంటర్టైన్‌మెంట్ ఛానెల్ జీ తెలుగు మంచి ధరకు సొంతం చేసుకుంది.

రాశి ఖన్నా మరియు రజిషా విజయన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహించారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌ పై ఎస్.లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చంకీ పాండే, లైలా, మురళీ శర్మ, మునీష్‌కాంత్ కీలక పాత్రలు పోషించగా, జివి ప్రకాష్ సంగీతం అందించారు. నాగార్జున యొక్క అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్‌ను ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో విడుదల చేసింది.

Exit mobile version