ఓటిటిలో “కాంతారా” రిలీజ్ పై నిర్మాత నుంచి క్లారిటీ.!

ఇటీవల కన్నడ సినిమా సహా తెలుగు మరియు తమిళ్ సినిమాలో కూడా భారీ రెస్పాన్స్ తో వసూళ్లు కొల్లగొడుతున్న లేటెస్ట్ చిత్రం “కాంతారా” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు అలాగే హీరోగా రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికీ కూడా థియేటర్స్ లో సాలిడ్ రన్ ని కొనసాగిస్తోంది. మరి ఇంత సూపర్ స్ట్రాంగ్ గా కంటిన్యూ అవుతున్న ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై అయితే గత కొన్ని రోజులు నుంచి కొన్ని రూమర్స్ కన్నడ నుంచి కూడా స్టార్ట్ అయ్యాయి.

ఈ నవంబర్ 4 నుంచే సినిమా స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేస్తున్న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం అందుబాటులోకి వస్తుంది అని బజ్ రాగా దీనిపై అయితే చిత్ర నిర్మాత కార్తీక్ గౌడ స్పందిస్తూ కొట్టి పడేసారు. సినిమా నవంబర్ నుంచి స్ట్రీమింగ్ అనేది అవాస్తవం అని ఈ చిత్రం ఓటిటి లో ఎప్పుడు వస్తుంది అనే వార్త ఏదన్నా ఉంటే మేమే అనౌన్స్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. దీనితో ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.

Exit mobile version