సమీక్ష : “బొమ్మ బ్లాక్ బస్టర్” – డిజప్పాయింట్ చేసే సిల్లీ డ్రామా

Bomma Blockbuster Movie-Review-In-Telugu

విడుదల తేదీ : నవంబర్ 04, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: నందు విజయ్ కృష్ణ, రష్మీ గౌతమ్, కిరీటి దామరాజు, రఘు కుంచె

దర్శకుడు : రాజ్ విరాట్

నిర్మాతలు: ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి ఈడ

సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి

సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ్

ఎడిటర్: బి సుభాస్కర్

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

 

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు నందు అలాగే తెలుగు స్మాల్ స్క్రీన్ యాంకర్ రష్మీ గౌతమ్ లు హీరో హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “బొమ్మ బ్లాక్ బస్టర్”. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు అయితే థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే పోతురాజు(నందు) దర్శకుడు పూరి జగన్నాథ్ కి ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ కాగా తాను ఆ డైరెక్టర్ తో తన నిజ జీవితంలో జరిగిన సంఘటనలు పై సినిమా చేయాలని కలలు కంటాడు. అయితే క్రమంలో పోతురాజు లైఫ్ లో తన తండ్రి మరణంతో ఒక్కసారిగా తన లైఫ్ మారిపోతుంది. అక్కడ నుంచి పోతురాజు లైఫ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి? తన తండ్రి మరణానానికి కారణం ఏంటి? తాను చివరికి ఏం చేస్తాడు అనేది తెలియాలి అంటే వెండితెర మీద చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఇది వరకు నందు పలు చిత్రాల్లో ఎన్నో రోల్స్ చేసాడు. అయితే హీరోగా వచ్చిన సినిమాల్లో అయితే కంప్లీట్ గా తన నటన వేరేలా ఉంటుంది. అలా ఇంతకు ముందు సవారీ లో ఓ ఐకానిక్ పెర్ఫామెన్స్ ని తాను చేసాడు. అలాగే ఆ తరహాలోనే ఈ చిత్రంలో కూడా తనకి ఒక రియలిస్టిక్ రోల్ వచ్చింది.

మరి దీనిలో కూడా తాను పలు సీన్స్ లో అయితే డీసెంట్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు. అలాగే సినిమాలో కొన్ని సీన్స్ నేటివిటీ బాగుంది. అలాగే కొన్ని యాక్షన్స్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే రశ్మితో కొన్ని సీన్స్ లో మెయిన్ లీడ్ కెమిస్ట్రీ బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో మేజర్ డ్రా బ్యాక్ ఏదన్నా ఉంది అంటే అసలు సినిమాలో ఎక్కడా పెద్దగా సీరియస్ నెస్ కనిపించదు. కథనం చాలా పేలవంగా కనిపిస్తుంది. అలాగే కథ కూడా పెద్దగా కొత్తగా ఏమీ అనిపించదు. కొన్ని సీన్స్ వరకు పర్వాలేదు కానీ చాలా వరకు అయితే దర్శకుడు అనవసర సీన్స్ తో సినిమాని బాగా సాగదీతగా తీసాడు.

దీనితో చూస్తున్నంత సేపు సినిమాపై అంత ఆసక్తి అయితే ఎక్కడా కనపడదు. ఇక చాలా సీన్స్ లో అయితే నందు కూడా డిజప్పాయింట్ చేస్తాడు. అనవసరంగా ఓవర్ అగ్రెసివ్ గా తన నటన కనిపిస్తుంది. దీనితో సినిమాపై మరింత బోర్ ఫీల్ కలుగుతుంది. ఇక రష్మీ కూడా సినిమాలో ఏమంత హైలైట్ గా మారలేకపోయింది.

నటిగా ఆమెకి స్కోప్ ఇచ్చే రేంజ్ సీన్స్ అయితే ఎక్కడా కూడా లేవు. అలాగే ఇంకొందరు కీలక పాత్రధారులు కనిపిస్తారు కానీ వారిని కూడా పెద్దగా సరైన పాత్రల్లో యూజ్ చేసినట్టు అనిపించదు.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో కాస్త పాజిటివ్ అంశం ఏదన్న ఉంది అంటే అది టెక్నీకల్ టీం ఎఫర్ట్స్ అని చెప్పాలి. ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయ్యింది. అలాగే సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ తో మంచి విజువల్స్ చూపించాడు. అలాగే నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఇక దర్శకుడు రాజ్ విరాట్ విషయానికి వస్తే తాను తాను ఈ సినిమా విషయంలో ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. కథా కథనాల్లో ఎక్కడా కొత్తదనం అనేది కనిపించదు. అలాగే అంత ఆకట్టుకునే స్క్రీన్ ప్లే ని కూడా తాను రాసుకోలేకపోయాడు. ఓవరాల్ గా అయితే తన వర్క్ మాత్రం ఇంప్రెస్ చెయ్యదు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే టైటిల్ లో “బొమ్మ బ్లాక్ బస్టర్” అని పెట్టుకున్న ఈ సినిమా రియాలిటీలో బాగా డిజప్పాయింట్ చేస్తుంది. నందు నుంచి అక్కడక్కడా మెప్పించే నటన సాంకేతికత టీం వర్క్ తప్ప సినిమాలో ఆడియెన్స్ ని ఏ అంశం కూడా పెద్దగా ఇంప్రెస్ చెయ్యదు. ఈ వారానికి అయితే ఈ చిత్రాన్ని స్కిప్ చేసేసినా పర్వాలేదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version