టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ కథానాయికగా ఒక్కో సినిమాతో ఆడియన్స్, ఫ్యాన్స్ నుండి మంచి క్రేజ్ ని మంచి ఆదరణని అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు అనుష్క శెట్టి. ఇక ఆమె నుండి సినిమా వచ్చి రెండేళ్లు అవుతుండడంతో ఆమె తాజా సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల ఆమె చేయనున్న కెరీర్ 48వ మూవీ గురించి ప్రకటన వచ్చింది. యువ దర్శకుడు పి మహేష్ దర్శకత్వంలో రూపొందనున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో ఆమె నటిస్తుండగా నవీన్ పోలిశెట్టి హీరోగా కనిపించనున్నారు.
టాలీవుడ్ ప్రఖ్యాత సంస్థ యువి క్రియేషన్స్ వారు రూపొందిస్తున్న ఈ మూవీ నుండి అనుష్క శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ ని నేడు ఆమె జన్మదినం సందర్భముగా కొద్దిసేపటి క్రితం మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలో ఆమె ప్రొఫెషనల్ చెఫ్ అన్వితా రవళి శెట్టి పాత్రలో కనిపిస్తున్న ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియా లో ట్రెండ్ ఆవుతోంది. కాగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ అప్ డేట్స్, రిలీజ్ డేట్ వంటి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
Happy Birthday ???? Sweety ❤️
Introducing 'Anvitha Ravali Shetty' aka our beautiful actress @MsAnushkaShetty @NaveenPolishety #MaheshBabuP #NiravShah @UV_Creations #ProductionNo14 #Anushka48 #NaveenPolishetty3 pic.twitter.com/OmLLhGoawD
— UV Creations (@UV_Creations) November 7, 2022