సమీక్ష : `మది` – స్లోగా సాగే బోరింగ్ ప్రేమకథ !

Madhi Movie-Review-In-Telugu

విడుదల తేదీ : నవంబర్ 11, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: శ్రీరామ్‌ నిమ్మల, రిచాజోషి, రామ్‌ కిషన్‌, శ్రీకాంత్‌, బైరోజ్‌ తదితరులు

దర్శకుడు : నాగ ధనుష్‌

నిర్మాత: రామ్‌ కిషన్‌

సంగీత దర్శకులు: పీవీఆర్‌ రాజా

సినిమాటోగ్రఫీ: విజయ్ ఠాగూర్

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

 

నాగ ధనుష్‌ దర్శకత్వంలో శ్రీరామ్‌ నిమ్మల హీరోగా రిచాజోషి హీరోయినగా నటించిన సినిమా మది. కాగా ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ:

 

శ్రీరామ్‌ నిమ్మల (అభి మన్యు) – రిచాజోషి (మధు) ఇద్దరూ చిన్న తనం నుంచే ఒకరికి ఒకరు బాగా తెలుసు. రిచాజోషి పక్కింటిలోనే శ్రీరామ్‌ నిమ్మల కూడా ఉంటాడు. వీరిద్దరి మధ్యలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా వీరిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. కానీ, దురదృష్టవశాత్తు, కులం పేరుతో రిచాజోషి (మధు) ఫాదర్, వీరి ప్రేమకు అడ్డుగా నిలుస్తాడు. మధు తండ్రి తన కూతుర్ని బెదిరించి ఆమెకు వేరే వ్యక్తితో వివాహం చేస్తాడు. అనంతరం శ్రీరామ్‌ నిమ్మల – రిచాజోషి జీవితాలు ఎలా టర్న్ తీసుకున్నాయి ?, తన లవర్ ను దక్కించుకోవడానికి శ్రీరామ్‌ నిమ్మల ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ?, ఈ క్రమంలో వీరిద్దరూ తీసుకున్న నిర్ణయం ఏమిటి ?, చివరకు శ్రీరామ్‌ నిమ్మల జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్:

 

అభి పాత్రలో శ్రీరామ్‌ నిమ్మల నటన ఆకట్టుకుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో మరియు కొన్ని ఎమోషనల్ సీన్స్ లో శ్రీరామ్‌ నిమ్మల తన హావాబావాలతో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ గా నటించిన రిచాజోషి తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. బోల్డ్ లుక్ లో కూడా ఆమె చాలా సహజంగా నటించింది. నాగ ధనుష్‌ దర్శకత్వంలో ఎమోషనల్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమాలో కొన్ని ఎమోషన్స్ బాగున్నాయి.

ప్రేమించిన అమ్మాయి కోసం అభి తనే ప్రాణ త్యాగం చేయడం, అలాగే ప్రేమ కోసం అభి – మధు ఒకరికి ఒకరు బాసటగా నిలవడం బాగుంది. ఇతర కీలక పాత్రల్లో నటించిన రామ్‌ కిషన్‌, శ్రీకాంత్‌, బైరోజ్‌, స్నేహ మాధురి శర్మ లు కూడా తమ ఎక్స్ ప్రెషన్స్ తో, తమ శైలి మాడ్యులేషన్స్ తో నవ్వించే ప్రయత్నం చేశారు. అదే విధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

మైనస్ పాయింట్స్:

 

ఓ ట్రాజెడీ ప్రేమ కథకు సంబంధించి దర్శకుడు నాగ ధనుష్‌ ఏవరేజ్ స్టోరీ లైన్ ను తీసుకున్నా.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కూడా కథాకథనాలను రాసుకోలేదు. దీనికి తోడు మది సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి తప్ప, ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు.

పైగా కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువవడంతో కథలో సహజత్వం చాలా వరకు లోపించింది. నిజానికి సినిమాలో నాగ ధనుష్‌ చెప్పాలనుకున్న కథాంశం బాగుంది. కథాంశం బాగున్నా ఓవరాల్ గా ఈ చిత్రం నెమ్మదిగా సాగుతుంది. కథ పరంగా ఇంటర్నల్ లింక్స్ తో సాగే స్క్రీన్ ప్లేలోని డెప్త్ అండ్ ఇంట్రెస్ట్ ను దర్శకుడు పట్టుకోలేకపోయాడు.

ఇక సినిమాలో సెకండాఫ్ కూడా స్లోగా సాగింది. ప్రధానంగా కొన్ని సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నరేషన్ మిస్ అయింది. కొన్ని చోట్ల క్యారెక్టర్స్ కొత్తగా అనిపించినా… కొన్ని సన్నివేశాలు రొటీన్ గానే సాగాయి. నిజానికి సినిమాలో బలమైన ఎమోషన్ ఉన్నా.. సరైన ట్రీట్మెంట్ లేకపోవడంతో ఆ ఎమోషన్ కొన్ని చోట్ల ఎలివేట్ కాలేదు.

 

సాంకేతిక విభాగం:

 

సాంకేతిక విభాగం గురించి ముందు చెప్పుకున్నట్లుగానే సినిమాలో సంగీత దర్శకుడు పీవీఆర్‌ రాజా అందించిన పాటలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సాంగ్ బాగుంది. అలాగే ఆ పాటను చిత్రీకరించిన విధానం కూడా బాగుంది. ఇక ఎడిటర్ ప్రదీప్ జంబిగ ఎడిటింగ్ పర్వాలేదు. అలాగే దర్శకుడు సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది, సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

 

తీర్పు:

 

‘మది’ అంటూ వచ్చిన ఈ సినిమా ‘మధు – అభి’ల చుట్టే తిరిగింది. హీరో శ్రీరామ్‌ నిమ్మల, హీరోయిన్ రిచాజోషి ల మధ్య వచ్చే రొమాంటిక్ అండ్ ప్రేమ సన్నివేశాలు బాగున్నాయి. కానీ కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేకపోవడం, లాజిక్ లెస్ సీన్స్, బోరింగ్ ప్లే వంటి అంశాలు సినిమాకి బాగా మైనస్ అయ్యాయి. మిగిలిన వర్గాల ప్రేక్షకులతో పాటు అందర్నీ ఈ సినిమా నిరాశ పరిచింది.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version