సీనియర్ లెజెండరీ సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారు మనల్ని అందరినీ విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయి అప్పుడే వారం రోజులవుతోంది. ఇక ఆయన మరణంతో తెలుగు చిత్రసీమ మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మరోవైపు ఘట్టమనేని కుటుంబసభ్యులు, కృష్ణ గారు మహేష్ గారి అభిమానులతో పాటు యావత్ తెలుగు ప్రేక్షకులు శాతం ఆ విషాదాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు. అయితే విషయం ఏమిటంటే, నిన్న తన తల్లితండ్రులైన కృష్ణ గారు, ఇందిరా దేవిగారి 60వ పెళ్లి రోజు సందర్భంగా వారిద్దరితో కలిసి కొన్నేళ్ల క్రితం దిగిన ఒక ఫోటోని తన ఇన్స్టాగ్రమ్ అకౌంట్ లో కొద్దిసేపటి క్రితం పోస్ట్ చేసారు మంజుల ఘట్టమనేని.
అలానే తమ తల్లితండ్రుల గురించి మంజుల గారు ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టారు. అమ్మ నాన్న ఇద్దరి మధ్య అనుబంధం ఎంతో గొప్పగా ఉండేది. ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమ, అభిమానం, ఆ విధంగా కొనసాగుతున్న వారి జీవితంలో ఇటీవల అమ్మ మరణంతో నాన్న ఎంతో కృంగిపోయారు. అనంతరం ఆయన కూడా ఆమె వద్దకే చేరుకున్నారు. వారు ఇద్దరూ ప్రస్తుతం అదే ప్రేమానుబంధంతో తప్పకుండా స్వర్గంలో ఉండి ఉంటారు. అటువంటి మంచి మనసున్న వారికి బిడ్డగా జన్మించినందుకు ఎప్పుడూ గర్వంగా సంతోషంగా చెప్పుకుంటాము అన్నారు. అయితే వారి వంటి ఆలోచనలు, భావాలను కనీసం 10 శాతం అయినా మనం అనుసరించగలిగితే అదే వారికి మనం మనస్ఫూర్తిగా అందించే నిజమైన బహుమతి అంటూ మంజుల గారు పెట్టిన ఎమోషనల్ పోస్ట్ అందరినీ కదిలిస్తోంది.