సమీక్ష : మట్టి కుస్తీ – కొన్ని చోట్ల మెప్పించే ఫ్యామిలీ స్పోర్ట్స్ డ్రామా !

Matti Kusthi Movie-Review-In-Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 02, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: విష్ణు విశాల్, ఐశ్వర్యలక్ష్మి, గజరాజ్, కరుణాస్, శ్రీజ రవి, మునిష్కాంత్, కాళీ వెంకట్, హరీష్ పేరడి, అజయ్, శత్రు

దర్శకుడు : చెల్లా అయ్యావు

నిర్మాతలు: రవితేజ, విష్ణు విశాల్

సంగీత దర్శకులు: జస్టిన్ ప్రభాకరన్

సినిమాటోగ్రఫీ: ఎస్.మణికందన్

ఎడిటర్: ప్రసన్న జికె

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

విష్ణు విశాల్ హీరోగా ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటించిన మూవీ ‘మట్టి కుస్తీ’. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

వీర (విష్ణు విశాల్) తన జీవితంలో ఎలాంటి లక్ష్యాలు లేకుండా ఫ్రెండ్స్ తో సరదాగా మందు కొడుతూ ఊరిలో పంచాయితీలు చేస్తూ బతుకుతుంటాడు. ఇలాంటి వీర పెళ్లికి సిద్ధం అవుతాడు. కాబోయే భార్య కి పొడవాటి జుట్టు ఉండాలని, చదువు లేని అమ్మాయి అయ్యి ఉండాలని షరతులు పెడతాడు. దాంతో వీర కు నచ్చే అమ్మాయి దొరకదు. మరోపక్క కీర్తి (ఐశ్వర్య లక్ష్మి) కుస్తీలో స్టేట్ లెవల్ ప్లేయర్. మగాడిలా జుట్టు కత్తిరించి కుస్తీ పడుతూ ఉంటుంది. పైగా కీర్తి లో దూకుడు ఎక్కువ. ధైర్యవంతురాలు కూడా. వీర కోరుకున్న అమ్మాయికి పూర్తి విరుద్ధం. అయితే కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో వీర కి – కీర్తి కి పెళ్లి జరుగుతుంది. మరి నిజం తెలిశాక, వీరి – కీర్తి ల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి?, వీరిద్దరూ భార్యాభర్తలుగా కలిసి ఉంటారా? లేదా ?, అసలు కుస్తీ క్రీడలో వీర తన భార్య కు పోటీగా పాల్గొనాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

భార్యభర్తల మధ్య సాగిన ఈ కుస్తీ డ్రామాలో కొన్ని కామెడీ సీన్స్, ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య వచ్చే ఇగో, వినోదం అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఆడ మగ సమానమే అనే సందేశాన్ని చాలా వినోదాత్మకంగా చూపించడం బాగుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన విష్ణు విశాల్ తన నటనతో, తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు.

ఇక హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య లక్ష్మి కూడా తన రఫ్ మూమెంట్స్ తో పాటు తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన అజయ్ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో కీర్తి పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన కుస్తీ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన వీర పాత్ర.. మరియు మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ అఫ్ వ్యూస్.. మొత్తానికి ఈ సినిమాలో కొన్ని కామెడీ అంశాలు బాగానే ఉన్నాయి. నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

సినిమా మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు చెల్లా అయ్యావు విఫలం అయ్యాడు. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ అలాగే మంచి ఎంటర్ టైన్మెంట్ తో నడపాలి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ గ్రాఫ్ పెరగాలి. కానీ ఈ సినిమాలో అది మిస్ అయింది.

హీరో పెళ్లి విషయంలో మోసపోయాను అని తెలుసుకున్న దగ్గర నుంచి సాగే సన్నివేశాలు పూర్తి పేలవంగా సాగుతాయి. దీనికితోడు లాజిక్స్ కూడా ఎక్కడ కనిపించవు. అలాగే హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సమస్యకు సరైన బలం లేదు. అలాగే ఉన్న సమస్యను కూడా బలంగా చూపించడంలో కూడా దర్శకుడు నిరాశ పరిచాడు. అసలు ఈ కథలో ఫుల్ కామెడీని మెయింటైన్ చేయవచ్చు. ఫస్ట్ హాఫ్ కొంతవరకు ఫన్ తో సాగింది.

కానీ.. ఇంటర్వెల్ తర్వాత కామెడీ విషయంలోనూ సినిమా ఎఫెక్టివ్ గా లేదు. హీరో ట్రాక్ లోనూ ఎక్కడా లాజిక్ లేదు. పైగా ఆ ట్రాక్ మీదే సెకండ్ హాఫ్ మెయిన్ ప్లాట్ మొత్తం సాగడంతో సినిమాలో అదే పెద్ద మైనస్ అయింది. దానికి తోడు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఫేక్ గా అనిపిస్తాయి. దర్శకుడు మంచి మెసేజ్ అయితే ఇచ్చాడు గానీ, అది స్క్రీన్ మీద బాగా వర్కౌట్ కాలేదు.

 

సాంకేతిక విభాగం :

 

టెక్నికల్ గా చూసుకుంటే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తోంది. ఎడిటర్ మణికందన్ వర్క్ సినిమాకి తగ్గట్టు ఉంది. సినిమాలో నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

తీర్పు :

 

మట్టి కుస్తీ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కొన్ని కామెడీ సీన్స్ మరియు ఇంటర్వెల్ బాగున్నాయి. అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ పర్వాలేదనిపిస్తాయి. అయితే, ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఐతే, సినిమాలో విష్ణు విశాల్ నటన, ఐశ్వర్య లక్ష్మి లుక్స్ చాలా బాగున్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

 

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version