ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “హిట్ 2”..!

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన లేటెస్ట్ ఇంటెన్స్ థ్రిల్లర్ చిత్రం “హిట్ 2”. ఎప్పుడు నుంచో మంచి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఫైనల్ గా ఈరోజు నుంచి థియేటర్స్ లోకి వచ్చింది.

ఇక ఇప్పుడు అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ పార్ట్నర్ పై లేటెస్ట్ క్లారిటీ బయటకి వచ్చింది. ఈ చిత్రం తాలూకా స్ట్రీమింగ్ హక్కులని అయితే ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారే కొనుగోలు చేశారు. మరి గత ఫస్ట్ సినిమా కూడా వీరే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఫ్రాంచైజ్ ని అయితే వాల్ పోస్టర్ సినిమా వారు నిర్మాణం వహిస్తుండగా నాచురల్ స్టార్ నాని ప్రెజెంట్ చేస్తున్నాడు.

Exit mobile version