ఓటిటి లో తన సత్తా కొనసాగిస్తున్న సమంత “యశోద”

స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల హిట్ మూవీ యశోద రెండు రోజుల క్రితం డిజిటల్ రంగ ప్రవేశం చేసింది. హరి, హరీష్‌లు దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్‌కు ఓటిటి ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులను ఉర్రూతలూగించే సాలిడ్ కంటెంట్‌ను కలిగి ఉన్న ఈ చిత్రం ఇప్పుడు భారతదేశంలోని అమెజాన్ ప్రైమ్ వీడియో చార్టులలో టాప్ లో ట్రెండ్ అవుతోంది.

ఆన్‌లైన్‌లో చిత్రానికి మంచి ఆదరణ లభించడంతో మేకర్స్ చాలా సంతోషంగా ఉన్నారు. శ్రీదేవి మూవీస్ నిర్మించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌ కుమార్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్, కల్పిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Exit mobile version