ఓటీటీ రివ్యూ: విట్ నెస్ ( సోనీ లైవ్ లో ప్రసారం )

Witness Movie Review

విడుదల తేదీ : డిసెంబర్ 09, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి, సుబత్రా రాబర్ట్, షణ్ముగ రాజా, అళగం పెరుమాళ్, జి సెల్వ, రాజీవ్ ఆనంద్, తమిళరసన్, శ్రీనాథ్

దర్శకుడు : దీపక్

నిర్మాతల: టీజీ విశ్వ ప్రసాద్

సంగీత దర్శకులు: రమేష్ తమిళమణి

సినిమాటోగ్రఫీ: దీపక్

ఎడిటర్: ఫిలోమిన్ రాజ్

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ప్రముఖ నిర్మాత టి. జి. విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘విట్ నెస్’. ఈ సినిమాకు దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్ గా దీపక్ వ్యవహరించారు. శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా జీ5 లో స్ట్రీమింగ్ అయింది. మరీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం రండి.

 

కథ :

ఒక పారిశుద్ధ్య కార్మికురాలిగా ఇందిర(రోహిణి) తన కొడుకు పార్తిబన్(తమిళరసన్)తో లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటుంది. ఐతే, కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో వీళ్ల లైఫ్ లో ఓ ఊహించని సంఘటన జరుగుతుంది. అపార్ట్ మెంట్ లోని సెప్టిక్ ట్యాంక్ ని క్లీన్ చేస్తూ.. ఇందిర(రోహిణి) కొడుకు చనిపోతాడు. దీంతో ఇందిర(రోహిణి) జీవితం విషాదమయం అవుతుంది. తన కొడుకు చావుకు కారణం అయిన వారి పై న్యాయ పోరాటానికి దిగుతుంది. కమ్యూనిస్ట్ యూనియన్ లీడర్(సెల్వా) తో కలిసి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేస్తుంది. అనంతరం న్యాయం కోసం ఇందిర ఎలాంటి పోరాటం చేసింది ?, అవినీతి వ్యవస్థను ఆమె తట్టుకుని ఎలా నిలబడింది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

సెప్టిక్ ట్యాంక్ లో దిగి ఊపిరాడక కార్మికుడు మృతి అని చాలా సార్లు విని ఉంటాం. ఈ చిత్రంలో గత ఐదేళ్లలో చెన్నైలో దాదాపు 340 మంది ఇలానే చనిపోయారు. అదే విషయాన్ని ‘విట్ నెస్’ డైరెక్టర్ చాలా రియలిస్టిక్ గా చూపించే ప్రయత్నం చేశాడు. సమాజంలో ప్రస్తుత మనుషుల స్వభావం గురించి, సిస్టమ్ లోని లొసుగులు గురించి సినిమాలో చర్చించిన అంశాలు బాగున్నాయి.

అలాగే పేదవాళ్ళు, కార్మికుల కష్టాలను, బలహీనతలను అలాగే పొరపాట్లను కూడా ఈ చిత్రంలో దర్శకుడు చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా ఆయన రాసుకున్న ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. నటి రోహిణి ఈ చిత్రంలో పక్కా పారిశుద్ధ్య కార్మికురాలిగా చాలా బాగా నటించింది. తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. కొడుకు పాత్రలో నటించిన నటుడు కూడా బాగా నటించాడు.

మరో ప్రధాన పాత్రలో కనిపించిన శ్రద్ధా శ్రీనాథ్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించిన సెల్వా కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు. డైలాగ్స్, అండ్ కొన్ని ఎమోషన్స్ బాగున్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

సినిమా ప్రారంభ సీన్స్ నెమ్మదిగా సాగాయి. మొదటి పది నిమిషాల్లోనే రోహిణి తన కొడుకు చనిపోయాడనే వార్త విని, కాన్ ఫ్లిక్ట్ కి లోనైయినప్పటికీ, దర్శకుడు ఇంకా కొన్ని పాత్రలను పరిచయం చేస్తూ ప్లే ను స్లో గా డ్రైవ్ చేశాడు. అలాగే కొన్ని చోట్ల అయితే ఒక్కోసారి డాక్యుమెంటరీని చూస్తున్న అనుభూతి కలుగుతుంది.

ఇక కొడుకును కోల్పోయిన తల్లి యొక్క భావోద్వేగాలను ఆశించిన స్థాయిలో సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అలాగే కోర్ట్‌ రూమ్ డ్రామా వచ్చేంత వరకూ కొన్ని సీన్స్ చాలా సింపుల్ గా సాగుతూ బోర్ కొట్టించాయి. మొత్తమ్మీద దర్శకుడు ప్రస్తుత సమాజంలోని వాస్తవ పరిస్థితుల గురించి మంచి డ్రామా తీసుకున్నా.. పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కొన్ని సీన్స్ ను రాసుకోలేకపోయారు.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు.. దర్శకుడు దీపక్ మంచి పాయింట్ ను ఎంచుకున్నారు. అయితే, ఆ పాయింట్ కి తగ్గట్టు సరైన డ్రామాను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాత టి. జి. విశ్వ ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

విట్ నెస్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామాలో.. నేటి సమాజంలో వాస్తవ పరిస్థితులకు సంబంధించి ఇచ్చిన మెసేజ్, కొన్ని ఎమోషనల్ సీన్స్, కొన్ని డైలాగ్స్ వంటి ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. అయితే, సినిమా సీరియస్ మోడ్ లో సాగడం, అక్కడక్కడా కథనం నెమ్మదిగా సాగడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా, ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చుతుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version