థ్రిల్లింగ్ హర్రర్ మూవీ ‘మాసూద’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్


టాలీవుడ్ లో ఇటీవల తెరకెక్కిన థ్రిల్లింగ్ హర్రర్ ఎంటర్టైనర్ మాసూద రిలీజ్ అనంతరం ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. తిరువీర్, సంగీత, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిల రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్ వంటి వారు కీలక పాత్రలు చేసిన ఈ మూవీని సాయి కిరణ్ తెరకెక్కించగా స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా మాసూద మూవీని గ్రాండ్ గా నిర్మించారు.

ఆకట్టుకునే కథ కథనాలతో తెరకెక్కి థియేటర్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న మాసూద మూవీ పై పలువురు విశ్లేషకులు సైతం ప్రసంశలు కురిపించడం విశేషంగా చెప్పుకోవాలి. ఆద్యంతం హర్రర్, థ్రిల్లింగ్, సస్పెన్స్ అంశాలతో దర్శకుడు సాయి కిరణ్ తెరకెక్కించిన మాసూద ఫైనల్ గా డిసెంబర్ 21న ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా ద్వారా బుల్లితెర ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ పై కొద్దిసేపటి క్రితం ఆహా వారు అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసారు. మరి థియేటర్స్ ఆడియన్స్ ని అలరించిన ఈ మూవీ ఓటిటిలో ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

Exit mobile version