ఈ మాస్ ఎంటర్టైనర్‌కి జీ5 లో సూపర్ రెస్పాన్స్!


టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ చివరిసారిగా ఆగస్ట్‌ లో విడుదలైన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మాచర్ల నియోజకవర్గంలో కనిపించాడు. ఈ చిత్రం మంచి బజ్ మధ్య వచ్చింది, కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న రీతిలో వసూళ్ళను సాధించలేదు. ఈ చిత్రం ఇటీవల ఓటిటి ప్లాట్‌ఫారమ్ జీ 5 లో ప్రీమియర్ చేయబడింది.

తాజా వార్త ఏమిటంటే ఈ చిత్రం 75 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు సాధించింది. ఇదే విషయాన్ని కాసేపటి క్రితం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం తెలియజేసింది. కేథరిన్ థెరిస్సా మరియు కృతి శెట్టి కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి మరియు నికితా రెడ్డి నిర్మించారు. M.S రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి అంజలి ప్రత్యేక సాంగ్ లో నటించగా, మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

Exit mobile version